దర్శకుడు లోకేష్ కనగరాజ్ టాలెంట్ ని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమాగా ఖైదీ స్థానం ఎప్పటికీ ప్రత్యేకమే. అంతకు ముందు మానగరం తీసి ప్రశంసలు అందుకున్నప్పటికీ అతని రియల్ స్టామినా బయట పెట్టింది మాత్రం కార్తినే. ఆ తర్వాత విజయ్, కమల్ హాసన్, రజనీకాంత్ లాంటి స్టార్లు పిలిచి మరీ అవకాశాలు, బ్లాక్ బస్టర్లు ఇచ్చారు. వాటిలో ఒక్క కూలి మాత్రమే అంచనాలు అందుకోలేక యావరేజ్ అయ్యింది. అయితే ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఖైదీ 2ని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. నిజానికి సీక్వెల్ కి ఎక్కువ స్కోప్ ఉన్న మూవీ ఇది. జైలుకు రాకముందు ఢిల్లీ ఏం చేసేవాడనే క్యూరియాసిటీ అభిమానుల్లో ఎక్కువగా ఉంది.
కానీ లోకేష్ కనగరాజ్ నుంచి ఖైదీ 2కి సంబంధించి ఎలాంటి కదలిక లేదు. ఒకపక్క కమల్ రజని మల్టీస్టారర్ చేజారిపోయింది. అమీర్ ఖాన్ తో ప్లాన్ చేసుకున్న ఫాంటసీ మూవీ ఉంటుందో లేదో చెప్పలేని పరిస్థితి నెలకొంది. తెలుగులో ప్రభాస్ లాంటి స్టార్లను ట్రై చేస్తున్నా వెంటనే గ్రీన్ సిగ్నల్ దొరకడం లేదు. ఇటు కార్తీ ఖైదీ 2 చేయడానికి సిద్ధంగా ఉన్నా లోకేష్ వైపు నుంచి రెస్పాన్స్ లేదు. అన్నగారు వస్తారు ప్రమోషన్లలో భాగంగా ఎదురైన ప్రశ్నకు సమాధానం చెబుతూ నాకు తెలియదు, నాకు తెలియని అప్డేట్ ఖైదీ 2నే అని కార్తీ చెప్పడం చూస్తే ఈ ప్రాజెక్టు ఎప్పటికీ రాదేమోనని ఫ్యాన్స్ దిగులు పడుతున్నారు.
లోకేష్ చేతిలో ఖైదీ 2 ఒకటే కాదు. చాలా కథలున్నాయి. రోలెక్స్, విక్రమ్ 2 కూడా రెడీ చేసి పెట్టుకుంటానని ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ ఆ మాట నిజం కాలేదు. నిజానికి ఇప్పుడు తనున్న సిచువేషన్ లో ఖైదీ 2తో కంబ్యాక్ అయితే ఓ రేంజ్ లో కిక్ ఉంటుంది. తనకు బ్రేక్ ఇచ్చిన హీరో కార్తీ అని, ఖచ్చితంగా తనను వదిలే సమస్య లేదని కూలి ప్రమోషన్లలో చెప్పుకున్న లోకేష్ ఇప్పుడా ప్రస్తావన ఎందుకు తేవడం లేదో అంతు చిక్కడం లేదు. సరే ఖైదీ 2 తీయకపోయినా పర్లేదు కానీ అదేదో డైరెక్ట్ గా చెప్పేస్తే ఆలోచించడం మానేస్తాం అంటున్నారు ఫ్యాన్స్. కానీ లోకేష్ మాత్రం అంత ఈజీగా తేల్చేలా లేడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates