ఫస్ట్ విడుదల కావాల్సిన బైకర్ హఠాత్తుగా వెనక్కు తగ్గడంతో శర్వానంద్ మరో సినిమా నారీనారీ నడుమ మురారి ముందుకు వచ్చేసింది. నిర్మాత మొదటి నుంచి చెబుతున్నట్టుగా సంక్రాంతి బరిలో దిగుతోంది. జనవరి 14 సాయంత్రం ప్రీమియర్లతో షోలు ప్రారంభం కాబోతున్నట్టు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అంటే టెక్నికల్ గా అసలు డేట్ 15 అవుతుంది. టైం నిర్ణయించుకునే విషయంలో కూడా టీమ్ తెలివైన ఎత్తుగడ వేసింది. అప్పటికంతా అన్ని పండగ సినిమాల టాక్స్, రివ్యూస్ వచ్చేసి ఉంటాయి కాబట్టి దేని స్టామినా ఎంత, పోటీ ఎలా ఉంటుందనే క్లారిటీ స్పష్టంగా వచ్చేస్తుంది.
ఒక విషయంలో మురారి ధైర్యాన్ని మెచ్చుకోవాలి. అవతల అరడజను సినిమాలు పోటీలో ఉన్నప్పటికీ రిస్క్ తీసుకుని మరీ క్లాష్ కు సిద్ధపడటం చిన్న విషయం కాదు. అందులో కూడా రేస్ లో లాస్ట్ లో జాయినవుతూ. ఇంత కాన్ఫిడెన్స్ ప్రదర్శించడం వెనుక కారణం లేకపోలేదు. సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఎంటర్ టైన్మెంట్ హిలేరియస్ గా వచ్చిందట. ప్రివ్యూలు చూసిన వాళ్ళ నుంచి వినిపించిన మాట ఇది. శర్వానంద్ లో ఒకప్పటి రన్ రాజా రన్ కామెడీ టైమింగ్ చూస్తామని, ఓటిటికి మంచి రేట్ రావడానికి కారణం కూడా వినోదమే అంటున్నారు.
ఇలాంటి కాంపిటీషన్ ని తట్టుకుని శర్వానంద్ గతంలో రెండుసార్లు గెలిచాడు. అవి శతమానం భవత్, ఎక్స్ ప్రెస్ రాజా. ఇప్ప్పుడు అదే రిపీట్ అవుతుందనే ధీమా మేకర్స్ లో ఉంది. కానీ అప్పటి పరిస్థితులకు ఇప్పటికి చాలా తేడా ఉంది. ప్రభాస్, చిరంజీవి, వెంకటేష్, రవితేజ, నవీన్ పోలిశెట్టి, విజయ్, శివ కార్తికేయన్ లతో ఫైట్ చేయడం అంత ఈజీ కాదు. అసలు కొన్ని సెంటర్లలో నారీనారీ నడుమ మురారికి స్క్రీన్లు దొరకడం కూడా కష్టం కావొచ్చు. అయినా సరే అనిల్ సుంకర రిస్కుకు సై అన్నారు. ఆ నమ్మకం గెలిస్తే మంచిదే. మనం నిరాశపరిచాక గ్యాప్ తీసుకున్న శర్వానంద్ కు పెద్ద ఊరట దక్కుతుంది.
This post was last modified on December 9, 2025 9:42 pm
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. భారత్ సహా వియత్నాం, థాయిలాండ్ నుంచి వచ్చే బియ్యంపై…
రాజకీయంగా ప్రశాంతంగా ఉండే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. ఇప్పటి వరకు ఎవరినీ టార్గెట్ చేయలేదు. తన సతీమణి,…
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. స్వప్నిస్తున్న తెలంగాణ విజన్ డాక్యుమెంటును తాజాగా మంగళవారం సాయంత్రం ఫ్యూచర్…
రకరకాల ప్రచారాలు, వదంతులు, డిస్కషన్లు, సోషల్ మీడియా తిట్లు, ఎన్నెన్నో కథలు వెరసి గత అయిదు రోజులుగా పెద్ద చర్చగా…
టెస్ట్ సిరీస్ ఓటమి బాధను మరిపిస్తూ వన్డే సిరీస్ గెలిచిన టీమిండియా, ఇప్పుడు టీ20లోనూ అదే జోరు కొనసాగించింది. కటక్లోని…
టెక్ ప్రపంచంలోనే ఒక సంచలన ప్రకటన వెలువడింది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.…