పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనాలు నమోదు చేస్తున్న దురంధర్ మొదటి వారం తిరక్కుండానే నూటా యాభై కోట్లు వసూలు చేయడంతో పార్ట్ 2కి డిమాండ్ వస్తోంది. ఎండ్ టైటిల్స్ లో దాని విడుదల తేదీని వచ్చే ఏడాది మార్చి 19 అని అఫీషియల్ గా వేసేశారు. ఆ మేరకు బిజినెస్ అగ్రిమెంట్లు జరిగిపోతున్నాయి. ఇంకో వంద రోజులే సమయం ఉండటంతో నిర్మాణ సంస్థ దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది. అయితే అదే రోజు యష్ టాక్సిక్ ఉంది. ఎప్పుడో నెలల క్రితమే ఈ తేదీని వాళ్ళు అధికారికంగా ప్రకటించారు. వాయిదాల గురించి వస్తూనే ఉన్నాయి కానీ డేట్ మారలేదు.
తాజాగా యష్ పెట్టిన ట్వీట్ చూస్తుంటే టాక్సిక్ ప్లాన్ లో ఎలాంటి మార్పు లేదనే క్లారిటీ వచ్చేసినట్టే. వెనుక నుంచి తీరిన బ్యాక్ స్టిల్ తో కొత్త పోస్టర్ వదిలిన టీమ్ రాజీ లేదని చెప్పకనే చెప్పింది. ఒకరకంగా చెప్పాలంటే ఇది టఫ్ ఫైట్ కానుంది. ఎందుకంటే కెజిఎఫ్ వల్ల యష్ కు హిందీలోనూ మార్కెట్ ఏర్పడింది. పైగా కియారా అద్వానీ, నయనతార లాంటి క్యాస్టింగ్ వల్ల నార్త్ సౌత్ ఫ్లేవర్స్ రెండూ మిక్స్ అయిపోయాయి. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ప్యాన్ ఇండియా అప్పీల్ వచ్చేలా స్క్రిప్ట్ ని అన్ని హంగులతో తీర్చిద్దిదారట. టీజర్ తో అనుమానాలు పటాపంచలు చేసేందుకు రంగం సిద్ధమయ్యిందని టాక్.
ఇక దురంధర్ 2 విషయానికి వస్తే చెప్పాల్సిన అసలు కథని దర్శకుడు ఆదిత్య ధార్ ఇందులో దాచేయడంతో ఫ్యాన్స్ లో దీని మీద ఆసక్తి పెరుగుతోంది,. దురంధర్ 2 ఈ డేట్ తీసుకోవడం వెనుక కారణం ఉంది. రన్బీర్ కపూర్ – విక్కీ కౌశల్ తో సంజయ్ లీలా భన్సాలీ తీసిన లవ్ అండ్ వార్ తప్పుకోవడంతో ఆ అవకాశాన్ని రణ్వీర్ సింగ్ బృందం తీసుకుంది. ఓపెనింగ్స్, వసూళ్లు, రివ్యూలు, పబ్లిక్ టాక్స్ ఇలా అన్ని విషయాల్లో బోలెడు పోలిక వస్తుంది. పైగా రెండూ డార్క్ యాక్షన్ డ్రామాలు కావడం గమనించాల్సిన విషయం. ఇవి వచ్చిన పది రోజులకే పెద్ది, ది ప్యారడైజ్ ఉన్నాయి. ఇవి మాట మీద ఉంటాయో లేదో చూడాలి.
This post was last modified on December 9, 2025 12:26 pm
గత నెలలో ఏపీలోని విశాఖలో నిర్వహించిన సీఐఐ పెట్టుబడుల సదస్సుకు పోటీ పడుతున్నట్టుగా.. తెలంగాణ ప్రభుత్వం తాజాగా రెండు రోజలు…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అగ్ర దర్శకుడు సుకుమార్ల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘రంగస్థలం’ ఎంత…
పెద్ద బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీస్ నుంచి వచ్చిన హీరోలకు కూడా సాధ్యం కాని ఘనతను.. తమిళ యంగ్ హీరో ప్రదీప్…
సాధారణంగా ప్రేమ విఫలమైతేనో, పెళ్లి ఆగిపోతేనో ఎవరైనా కొన్నాళ్లు డిప్రెషన్లోకి వెళ్తారు. ఆ బాధ నుంచి బయటపడటానికి నెలల సమయం…
తమ ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచి పనుల గురించి వివరించడంలో చంద్రబాబు ఎప్పుడూ ముందుంటారు. ఏపీ పునర్నిర్మాణానికి తమ ప్రభుత్వం…
టాలీవుడ్లో అత్యంత పొడవైన హీరోల లిస్టు తీస్తే.. అందులో రెబల్ స్టార్ ప్రభాస్ పేరే ముందు చెప్పుకోవాలన్నది వాస్తవం. టాలీవుడ్…