Movie News

చరణ్-సుకుమార్… కథ ఇంకా ఫైనల్ అవ్వలేదా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అగ్ర దర్శకుడు సుకుమార్‌ల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘రంగస్థలం’ ఎంత పెద్ద హిట్టయిందో.. కాల క్రమంలో ఎలా కల్ట్ స్టేటస్ తెచ్చుకుందో తెలిసిందే. మళ్లీ ఈ కలయికలో సినిమా అనేసరికి వీళ్లిద్దరి అభిమానులూ ఎంతో ఎగ్జైట్ అయ్యారు. ఈ సినిమాను ప్రకటించి రెండేళ్లు దాటిపోయింది. ఐతే సుకుమార్ ఏడాది పాటు ‘పుష్ప: ది రూల్’కే అంకితమై ఉన్నాడు. రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ పూర్తి చేసి ‘పెద్ది’లో బిజీ అయ్యాడు. 

చరణ్ వచ్చే వేసవికి కానీ ఈ సినిమాకు అందుబాటులోకి రాడు కాబట్టి సుకుమార్‌కు బాగానే టైం దొరికింది. ‘పుష్ప-2’ గత ఏడాది డిసెంబర్లో రిలీజ్ కాగా.. అప్పట్నుంచి సుకుమార్ ఖాళీగానే ఉన్నాడు. ఏడాది టైం గడిచిపోయింది కాబట్టి ఈపాటికి స్క్రిప్టు రెడీ అయిపోయి ఉంటుందని చాలామంది అనుకుంటున్నారు. ఇదే అంచనాతో ఈ సినిమా షూటింగ్ గురించి ఊహాగానాలు మొదలుపెట్టేశారు. ఇదొక ఇంటర్నేషనల్ మూవీ అని.. ఇంగ్లిష్ భాషలో కూడా తెరకెక్కుతుందని.. విదేశాల్లోనే 50 శాతానికి పైగా చిత్రీకరణ జరగబోతోందని ఒక ప్రచారం నడుస్తోంది. ఈ అప్‌డేట్స్ విని అంతా నిజమే అనుకుని ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు.

కానీ వాస్తవం ఏంటంటే.. ఇప్పటిదాకా చరణ్‌తో చేయబోయే సినిమాకు కథేంటన్నది కూడా ఫిక్స్ చేయలేదు సుకుమార్. ఆయన తన శిష్య బృందంతో కలిసి కొన్ని నెలలుగా కథా చర్చలు జరుపుతున్న మాట వాస్తవం. అందులో రెండు కథల మీద ప్రధానంగా డిస్కషన్లు సుదీర్ఘంగా సాగుతున్నాయి. కానీ వాటిలో ఏ కథనూ ఆయన ఫైనలైజ్ చేయలేదు. ఒకటి క్లాస్ టచ్ ఉన్న, కొంచెం మోడర్న్ టచ్ ఉన్న, విభిన్నమైన కథ అని సమాచారం. ఐతే ఆ కథ చేస్తే మరీ క్లాస్ అయిపోతుందేమో అనే అనుమానాలున్నాయి. 

ఇంకో కథ ఊర మాస్‌గా ఉంటుందట. కానీ అది చేస్తే రంగస్థలం, పుష్ప తరహాలోనే మళ్లీ రూరల్, రగ్డ్ మూవీ చేసినట్లు అవుతుందే అని ఆలోచిస్తున్నారట. అందుకే ఈ రెండు కథల్లో ఏది చేయాలనే మీమాంసలో సుకుమార్ ఉన్నట్లు సమాచారం. ముందు కథ ఫైనలైజ్ చేశాక.. దాన్ని పూర్తి స్క్రిప్టుగా మార్చడానికి చాలా టైం పడుతుంది. చరణ్ అందుబాటులోకి వచ్చే సమయానికి కూడా స్క్రిప్టు రెడీ అవుతుందా అన్నది సందేహమే. కానీ సుకుమార్‌తో సినిమా అంటే ఇవన్నీ మామూలే కాబట్టి చరణ్ కొన్ని రోజులు ఖాళీగా ఉండక తప్పకపోవచ్చని యూనిట్ వర్గాలు అంటున్నాయి.

This post was last modified on December 9, 2025 11:12 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రాజా సాబ్ రేయి కోసం రాష్ట్రాలు వెయిటింగ్

ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ జిఓ త్వరగా వచ్చేయడంతో 1000 రూపాయల ఫ్లాట్ రేట్…

2 hours ago

వంగ ఇంటర్వ్యూలో ఉండే మజానే వేరు

సినిమాల ప్రమోషన్స్ అంటే ఒకప్పుడు యాంకర్లతో ప్రశ్నలు అడిగించడం లేదా స్టేజ్ మీద హడావిడి చేయడం మాత్రమే ఉండేవి. కానీ…

2 hours ago

వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా సంతకం ఎలా?

సభకు రాలేదు.. కానీ సంతకాలు మాత్రం ఉన్నాయి.. అదెలా..? ఏపీ అసెంబ్లీలో వైసీపీ సభ్యుల తీరు ఇప్పుడు చర్చనీయాశంగా మారింది.…

2 hours ago

షాకింగ్… ట్విస్టింగ్… యష్ టాక్సిక్

కెజిఎఫ్ తర్వాత పెద్ద గ్యాప్ తీసుకున్న శాండల్ వుడ్ స్టార్ యష్ మార్చి 19న టాక్సిక్ తో ప్రేక్షకుల ముందుకు…

2 hours ago

వైభవ్ ఇండియా టీమ్ లోకి వస్తే ఎవరికి ఎఫెక్ట్?

14 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ స్టేడియంలో బౌలర్లను ఉతికి ఆరేస్తున్నాడు. కేవలం ఒక ప్రామిసింగ్ ప్లేయర్ లా కాకుండా,…

3 hours ago

చిరు-వెంకీ పాట‌లో లిరిక్ మార్పు నిజ‌మే

సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కాబోతున్న‌ మెగాస్టార్ చిరంజీవి సినిమా మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు నుంచి ఇటీవ‌ల రిలీజ్ చేసిన…

5 hours ago