తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ వేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇదే తరహాలో కొద్దిరోజుల క్రితం చిరంజీవి, నాగార్జున లాంటి సెలబ్రిటీలు డిజిటల్ రక్షణ పొందిన సంగతి తెలిసిందే. నిజానికిదంతా ప్రారంభమే అని చెప్పాలి. ఎందుకంటే ఏఐ మెల్లగా జనాల్లోకి చొచ్చుకుపోతోంది. పెద్దగా టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా సరే ప్రాంప్ట్స్ ఎలా ఇవ్వాలో ప్రాథమికంగా నేర్చుకుంటే చాలు బోలెడు మేజిక్ చేయొచ్చు. అదే ఇప్పుడు సోషల్ మీడియా కొంప ముంచుతోంది. గత కొన్ని వారాలుగా ఈ ట్రెండ్ ఊపందుకుంది.
స్టార్ హీరోలంతా ఒక టీ కొట్టు దగ్గర కాఫీ తాగుతున్నట్టు, అందరూ కలిసి జాతరకు వెళ్లినట్టు, క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నట్టు ఇలా రకరకాలుగా వీడియోలు సృష్టించి లక్షల్లో వ్యూస్ సంపాదిస్తున్నారు. ఇవన్నీ పాజిటివ్ గా ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. కానీ ట్రోలింగ్ చేయడమే టార్గెట్ గా పెట్టుకున్న కొందరు యాంటీ ఫ్యాన్స్ తప్పుడు వీడియోలు చేయడం తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. తారక్ లాంటి హీరోలు స్పందిస్తోంది ఇందుకే. ఇప్పుడే జాగ్రత్త పడకపోతే తర్వాత తీవ్ర నష్టం జరుగుతుంది. భవిష్యత్తులో అందరికి ఇది ముప్పుగా మారుతుంది. ప్రతి ఒక్కరు కోర్టు మెట్లు ఎక్కి ప్రొటెక్షన్ కావాలని అడుగుతారు.
ఏదైనా సరే మితిమీరితే ఇలాగే ఉంటుంది. ఏఐ వరుస చూస్తే నిజమనిపిస్తోంది. ఉచితంగా ప్రో వెర్షన్లను సంవత్సరానికి ఫ్రీగా ఇవ్వడం, ఎలా వాడుకోవాలో ట్విట్టర్ లాంటి మాధ్యమాల్లో టిప్స్ ఇవ్వడం లాంటివి నెటిజెన్లకు కొత్త విద్యలు నేర్పిస్తున్నాయి. కృత్రిమ మేధస్సు ఉద్దేశం మంచిదే అయినప్పటికీ దాన్ని తప్పుడు పద్దతి కోసం వాడితే అనర్థాలు జరిగే అవకాశాలు లేకపోలేదు. కొన్నేళ్ల క్రితం రష్మిక మందన్న, అలియా భట్ లాంటి వాళ్ళు డీప్ ఫేక్ వీడియోల వల్ల ఇబ్బంది పడ్డారు. ఈ మధ్యే అకీరానందన్, గౌతమ్ లను హీరోలుగా పెట్టి ఒకడు గంట యూట్యూబ్ ఏఐ సినిమా తీశాడు. భవిష్యత్తులో ఇంకెన్ని విపరీతాలు చూడాలో.
This post was last modified on December 8, 2025 10:16 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…