మెగా ఫ్యామిలీలోని తర్వాతి తరం వాళ్లందరినీ తన పిల్లల్లాగే చూస్తుంటాడు చిరంజీవి. నాగబాబు పిల్లలైన వరుణ్, నిహారికలు కూడా తన బిడ్డలనే అంటుంటాడు. వాళ్లతో చాలా క్లోజ్‌గా కనిపిస్తుంటాడు. ఇప్పుడు నిహారిక పెళ్లి జరుగుతున్న నేపథ్యంలో చిరు.. నాగబాబు లాగే ఒక తండ్రి లాగే భావోద్వేగానికి గురవుతున్నాడు. బుధవారం నిహారిక పెళ్లి నేపథ్యంలో ముందు రోజే ఆయన ట్విట్టర్లో ఒక పోస్టు పెట్టారు.
చిన్నప్పుడు నిహారికను ఎత్తుకున్న ఫొటోను, అలాగే ఇటీవల ఆమెను పెళ్లికూతురిని చేసిన సందర్భంగా దిగిన ఫొటోను పెట్టి .. ‘‘మా చేతిలో పెరిగిన మా చిన్నారి నిహారికని, చైతన్య చేతిలో పెడుతున్న ఈ శుభతరుణంలో, ముందస్తుగా, కాబోయే దంపతులకు నా శుభాకాంక్షలు , ఆశీస్సులు. God bless you’’ అని ట్వీట్ చేశారు చిరు. పెళ్లి కోసం కుటుంబ సమేతంగా చిరు ఇప్పటికే ఉదయ్‌పూర్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే.
కాగా మొన్న నిహారికను పెళ్లి కూతురిని చేసిన సందర్భంగా వెళ్లి ఆశీస్సులు అందిస్తూ చిరు బహుమతి రూపంలో ఒక పెద్ద బాక్స్‌ను నిహారికకు ప్రెజెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ బహుమతి గురించి టాలీవుడ్లో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. నిహారిక కోసం స్పెషల్‌గా డిజైన్ చేసిన లగ్జరీ డైమండ్ నెక్లస్‌ను చిరు ఇచ్చారని, దాని ఖరీదు ఏకంగా రూ.2 కోట్లని అంటున్నారు. ప్రేమను డబ్బుతో కొలవలేం కానీ.. నిహారిక కోసం చిరు ఎంత ఇంట్రెస్ట్ తీసుకున్నారనడానికి ఇది రుజువు.
ఇదిలా ఉండగా సోమవారం రాత్రి నుంచే పెళ్లి సంబరాలు మొదలు కాగా.. సంగీత్ కార్యక్రమంలో వధూవరులు సహా మెగా ఫ్యామిలీలో చాలామంది నృత్యాలు చేసి అలరించినట్లు తెలుస్తోంది. ఇందులోంచి నిహారిక, చైతన్య కలిసి డ్యాన్స్ చేసిన వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలోకి వచ్చేసింది. చిరు బ్లాక్ బస్టర్ పాట అయిన ‘ఆంటీ కూతురా అమ్మో అప్సరా’ (బావగారూ బాగున్నారా)కు నిహారిక, చైతన్య డ్యాన్స్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.#niharikawedding అనే హ్యాష్ ట్యాగ్ ఇండియా లెవెల్లో ట్రెండ్ అవుతుండటం విశేషం.
This post was last modified on December 8, 2020 2:12 pm
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…