బాక్సాఫీస్ దగ్గరే కాదు.. సోషల్ మీడియాలో కూడా తాను సూపర్ స్టార్‌నే అని మహేష్ బాబు మరోసారి రుజువు చేశాడు. 2020 సంవత్సరం చివరికి వచ్చిన నేపథ్యంలో వివిధ అంశాల్లో ఈ ఏడాది టాప్‌లో నిలిచిన హ్యాష్ ట్యాగ్స్, ఫొటోలు, వీడియోలు, పోస్టుల గురించి ట్విట్టర్ వివరాలు వెల్లడిస్తోంది. ఈ ఏడాది ఇండియా మొత్తంలో టాప్-3లో నిలిచిన సినిమా ట్యాగ్స్‌లో మహేష్ నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’కు సంబంధించింది ఒకటి ఉండటం విశేషం.
అనూహ్య రీతిలో మరణించిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి సినిమా ‘దిల్ బేచారా’ హ్యాష్ ట్యాగ్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. సుశాంత్ మరణానంతరం రిలీజైన అతడి చివరి సినిమా గురించి విపరీతమైన చర్చ జరిగిన నేపథ్యంలో ఆ హ్యాష్ ట్యాగ్ అగ్ర స్థానంలో నిలవడంలో ఆశ్చర్యం లేదు. అలాగే కరోనా అనంతరం ఇండియాలో రిలీజైన సినిమాలన్నింట్లోకి ఉత్తమమైన ఫలితం అందుకున్న ‘సూరారై పొట్రు’ గురించి కూడా పెద్ద చర్చే నడిచిన నేపథ్యంలో అది రెండో స్థానం సాధించింది. మూడో స్థానం ‘సరిలేరు నీకెవ్వరు’కే దక్కింది.
అల్లు అర్జున్ మూవీ ‘అల వైకుంఠపురములో’ దీన్ని మించి విజయం సాధించినప్పటికీ, బాలీవుడ్ మూవీ ‘తానాజీ’ ఈ ఏడాదికి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచినప్పటికీ.. వాటిని మించి ‘సరిలేరు..’ హ్యాష్ ట్యాగ్ పైన నిలవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. టాలీవుడ్‌కు సంబంధించి వరుసగా మూడేళ్లూ మహేష్ సినిమాల హ్యాష్ ట్యాగ్‌లే నంబర్ వన్‌గా నిలవడం విశేషం. 2018లో ‘భరత్ అనే నేను’, 2019లో ‘మహర్షి’ హ్యాష్ ట్యాగ్‌లు టాప్‌లో నిలిచాయి. దీన్ని బట్టి మహేష్ బాబు స్టార్ పవర్ ఎలాంటిదో.. సోషల్ మీడియాలో అతడికున్న ఫాలోయింగ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అందుకే అతను అసలైన ‘సూపర్ స్టార్’ అనడంలో సందేహం లేదు.
This post was last modified on December 8, 2020 2:09 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…