ఉప్పెన సినిమా చేసే సమయానికి కృతి శెట్టి వయసు కేవలం 17 ఏళ్లే. అంత చిన్న వయసులోనే ఆమె భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఆ చిత్రం ఏకంగా వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే. తర్వాత కృతి నటించిన శ్యామ్ సింగరాయ్ కూడా హిట్టయింది. తెలుగులో కృతి నటించిన మూడో చిత్రం బంగార్రాజు కూడా ఓ మోస్తరుగా ఆడింది. కానీ తర్వాత కృతిని వరుసగా పరాజయాలే పలకరించాయి. మరోవైపు తమిళంలో ఆమె నటించిన సినిమాల విడుదలలో ఆలస్యం జరిగింది.
దీంతో ఆమె మీద సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్లు పెరిగిపోయాయి. ఇవి ఆమెను బాగానే బాధించినట్లున్నాయి. తన కెరీర్లో ఒడుదొడుకుల గురించి మాట్లాడుతూ కృతి ఒక ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయిపోయింది. కన్నీళ్లు పెట్టుకుంది. గతంలో ఒక ఇంటర్వ్యూలో ప్రాంక్ చేసినందుకు కృతి ఏడ్చేయడంతో ఆమె ఎంత సెన్సిటివ్ అన్నది అర్థమైంది. ఇప్పుడు తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. మరోసారి తన సున్నితత్వాన్ని బయటపెట్టింది.
”కెరీర్లో నేను చాలా చిన్న వయసులోనే చాలా విషయాలు చూసేశాను. సోషల్ మీడియాలో ఒక దశలో నా మీద విమర్శలు, ద్వేషం చూసి చాలా బాధ పడ్డాను. సినిమాలు చేస్తున్నపుడు నటనలోనే చాలా శక్తి హరించుకుపోతుంది. అలాంటపుడు మన మీద అకారణంగా ద్వేషం చూపిస్తే తట్టుకోలేం. పైగా మన నియంత్రణలో లేని విషయాలకు మనల్ని బాధ్యులను చేసి విమర్శిస్తే చాలా బాధేస్తుంది.
మరోవైపు కెరీర్లో ఎన్నో తిరస్కరణలు కూడా ఎదురవుతుంటాయి. ఇలాంటి పరిణామాల మధ్య విపరీతమైన బాధ కలుగుతుంది. అలాంటి సమయంలో నాకు మా అమ్మే అండగా ఉంటుంది. అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తుంది. తల్లిగానే కాక అన్ని రకాలుగా నాకు మద్దతునిస్తుంది. ఆమె అవసరం నాకు ఎప్పుడూ ఉండాలనిపిస్తుంది. అమ్మతో పాటు నా స్నేహితులు కూడా పలు సందర్భాల్లో నా కోసం నిలబడ్డారు” అంటూ కన్నీటి పర్యంతం అయింది కృతి.
ఇలా ఏడుస్తున్నపుడు ఇంటర్వ్యూ నుంచి బ్రేక్ తీసుకోవాలని అనిపిస్తుందని.. కానీ తన స్ట్రగుల్ గురించి జనాలకు తెలియాలని ఆమె వ్యాఖ్యానించింది. సినిమాల్లోకి రాకముందు ఎవరైనా ఏమైనా కామెంట్ చేసినా పట్టించుకునేదాన్ని కాదని.. కానీ ఇప్పుడు మాత్రం తట్టుకోలేకపోతున్నానని.. తన కెరీర్లో అన్నీ అలా వేగంగా జరిగిపోయి.. చిన్న చిన్న విషయాలు కూడా తనను ప్రభావితం చేయడం మొదలైందని.. అన్నీ పర్సనల్‌గా తీసుకోవడంతో బాధ తప్పలేదని ఆమె.. ఇప్పుడింత సెన్సిటివ్‌గా ఎందుకు మారాను అనడానికి తన దగ్గర జవాబు లేదని ఆమె వ్యాఖ్యానించింది.
This post was last modified on December 8, 2025 6:43 am
ఒకప్పుడు అప్పు చేయాలంటే భయపడేవాళ్లు, అది అవసరానికి మాత్రమే తీసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ మారింది. అప్పు చేయడం తప్పు…
కూలీ సినిమా విడుదలకు ముందు దర్శకుడు లోకేష్ కనకరాజ్ భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఎంత చర్చ జరిగిందో.. ఎన్ని ఊహాగానాలు…
అఖిల్ కెరీర్ను మార్చేస్తుందని.. అతడిని పెద్ద స్టార్ను చేస్తుందని అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా.. ఏజెంట్. అతనొక్కడే,…
ప్రముఖ శ్రీ కృష్ణ క్షేత్రం ఉడిపిలోని పుట్టిగే శ్రీ కృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో ఏపీ…
రాష్ట్రంలోని ఒక్కొక్క నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కొక్క విధంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం లో ఉన్న పార్టీల వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ..…
స్వంత అభిమాని హత్య కేసులో అభియోగం ఎదురుకుంటున్న శాండల్ వుడ్ హీరో దర్శన్ ఎప్పుడు బయటికి వస్తాడో లేదా నేరం…