అఖిల్ కెరీర్‌ను మార్చేస్తుందని.. అతడిని పెద్ద స్టార్‌ను చేస్తుందని అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా.. ఏజెంట్. అతనొక్కడే, కిక్, రేసుగుర్రం, సైరా లాంటి సినిమాలతో అగ్ర దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించడంతో బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు జరిగిపోతాయని అంతా అనుకున్నారు. కానీ అఖిల్ తొలి చిత్రం అఖిల్‌ను మించి ఇది డిజాస్టర్ అయింది. మొత్తంగా టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద ఫ్లాపుల్లో ఒకటిగా నిలిచింది.
ఐతే ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. విడుదలకు ముందే ఏజెంట్ డిజిటల్ రైట్స్ అమ్ముడైనప్పటికీ.. థియేటర్లలో రిలీజైన రెండళ్లకు గానీ ఈ చిత్రం ఓటీటీలోకి రాలేకపోయింది. ఏజెంట్ అంత పెద్ద డిజాస్టర్ ఎందుకు అయిందో తెలుసుకోవడానికైనా ఓటీటీలో ఈ సినిమా చూద్దామని ఎదురు చూసి చూసి అలసిపోయారు జనం. ఏజెంట్ డిజిటల్ రిలీజ్ ఎందుకంత ఆలస్యం అయిందో దాని నిర్మాత అనిల్ సుంకర ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
తాను థియేట్రికల్ రిలీజ్‌కు ముందే ఒక వ్యక్తికి డిజిటల్ రైట్స్ అమ్మానని.. అతను తర్వాత సోనీ లివ్ వాళ్లకు హక్కులు అమ్ముకున్నాడని అనిల్ వెల్లడించారు. ఐతే ఆ రెండు వర్గాల మధ్య గొడవ తలెత్తిందని.. ఒక ఫేక్ కేస్ వల్ల డిజిటల్ రిలీజ్ ఆగిందని అనిల్ తెలిపారు. ఏజెంట్ హిందీ వెర్షన్ మాత్రం ఓటీటీలోకి వచ్చేసిందని.. తెలుగులో కూడా స్ట్రీమింగ్ చేసుకుని ఉంటే ఏ ఇబ్బందీ ఉండేది కాదని.. కానీ సోనీ లివ్ వాళ్లు కేసు విషయంలో భయపడి స్ట్రీమింగ్ వాయిదా వేశారని చెప్పారు అనిల్.
ఆ కేసులో న్యాయం లేదని తెలిసినా.. తాను అందులో జోక్యం చేసుకోలేకపోయానని అనిల్ తెలిపారు. ఇలా ఎందుకు జరుగుతోందని తాను రైట్స్ అమ్మిన వ్యక్తిని అడిగితే.. ఈ సినిమా హక్కుల వల్ల తాను నష్టపోయానంటూ తన మీదికి వస్తాడని, అందుకే తాను ఆ విషయంలో జోక్యం చేసుకోకుండా ఉండిపోయానని అనిల్ వెల్లడించారు. ఇక ఏజెంట్ మిస్ ఫైర్ కావడం గురించి ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమాకు మొదట్నుంచి ఏదీ కలిసి రాలేదన్నారు. ఎంతో ఎనర్జీతో సినిమాను మొదలుపెట్టినప్పటికీ.. అనుకున్నట్లుగా సినిమా తీయలేకపోయామని.. కొవిడ్ సహా అనేక కారణాలతో సినిమా దెబ్బ తిందని ఆయన చెప్పారు.
This post was last modified on December 7, 2025 10:40 pm
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…