నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా ‘అఖండ-2’ అనూహ్య పరిణామాల మధ్య వాయిదా పడిపోయిన సంగతి తెలిసిందే. ఒక రోజు ఆలస్యంగా అయినా సినిమా రిలీజవుతుందేమో అని అభిమానులు ఆశించారు కానీ.. అలా జరగలేదు. ఈ వీకెండ్ సినిమా రాదని తేలిపోయాక.. కొత్త డేట్ ఏదా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఒక వారం ఆలస్యంగా రిలీజవుతుందన్నారు కానీ.. అది కష్టమే అనిపిస్తోంది.
‘అఖండ-2’ వస్తే నాలుగు సినిమాలు డిసెంబరు 12 నుంచి వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది. అంతే కాక ‘అఖండ-2’ టీంకు కూడా హడావుడి తప్పదు. కాబట్టే ఈ డేట్‌ను వదిలేసినట్లే తెలుస్తోంది. ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లు కూడా 12 రిలీజ్ పట్ల విముఖతతోనే ఉన్నారట. వాళ్లతో పాటు అభిమానులు ఎక్కువగా కోరుకుంటున్న డేట్.. డిసెంబరు 25 అని తెలుస్తోంది.
అఖండ-2 లాంటి పెద్ద సినిమాకు ఫెస్టివల్ సీజనే కరెక్ట్ అన్నది మెజారిటీ అభిప్రాయం. అలా అని సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయాలంటే చాలా కష్టమే. అక్కడ ఆల్రెడీ బెర్తులు ఓవర్ క్రౌడ్ అయిపోయాయి. క్రిస్మస్‌కు ఇతర భాషల్లోనూ భారీ చిత్రాలు లేవు. తెలుగు విషయానికి వస్తే ఛాంపియన్, శంబాల మూవీస్ షెడ్యూల్ అయి ఉన్నాయి. ఎక్కువ రోజులు సెలవులున్న ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఇంకో రెండు సినిమాలను రిలీజ్ చేసినా ఇబ్బంది ఉండదు. 19న అంటే ‘అవతార్-3’తో సమస్య తప్పదు. ముఖ్యంగా యుఎస్‌లో కోరుకున్నన్ని స్క్రీన్లు దొరకవు. అందుకే ఎక్కువమంది డిస్ట్రిబ్యూటర్లు డిసెంబరు 25న సినిమాను రిలీజ్ చేయాలని అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.
ఈ రోజు హైదరాబాద్‌లో ‘అఖండ-2’ డిస్ట్రిబ్యూటర్లతో నిర్మాతలు సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి కొందరు ఇండస్ట్రీ పెద్దలు కూడా హాజరవుతున్నారు. ఏది బెస్ట్ డేట్ అనే విషయాన్ని చర్చించడంతో పాటు ముందు చేసుకున్న అగ్రిమెంట్లను రివైజ్ చేయడం మీదా మాట్లాడుకోబోతున్నారు. ఈ సమావేశం అయ్యాక ఈ రోజు లేదా ఒకట్రెండు రోజుల్లో రిలీజ్ డేట్ ఫైనలైజ్ చేసి ప్రకటన చేస్తారని సమాచారం. డిసెంబరు 25 డేట్‌ను ఎంచుకునే అవకాశాలు ఎక్కువ.
This post was last modified on December 7, 2025 2:22 pm
క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆశగా ఎదురుచూసిన పెళ్లి ఆగిపోయింది. ఒక సినిమాను మించిన మలుపులతో సాగిన స్మృతి మంధాన,…
మొన్నటి తరం లెజెండరీ హీరో వినోద్ ఖన్నా వారసుడిగా 1997లో బాలీవుడ్ కు వచ్చాడు అక్షయ్ ఖన్నా. కెరీర్ ప్రారంభంలో…
సౌతాఫ్రికా సిరీస్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం చూశాం. పది నెలల తర్వాత సొంతగడ్డపై ఆడుతూ పరుగుల వరద పారించాడు. మూడు…
పొన్నియిన్ సెల్వన్ తర్వాత మణిరత్నం కంబ్యాక్ అయ్యారని అభిమానులు భావించారు కానీ థగ్ లైఫ్ దెబ్బ మళ్ళీ కథను మొదటికే…
‘బాహుబలి’ కోసం ఐదేళ్ల పాటు ప్రభాస్ ఎంత కష్టపడ్డాడో.. రెండు పార్ట్స్లో ఎంతో ఆకర్షణీయంగా కనిపించాడో తెలిసిందే. కానీ అంత…
తన జీవితంలో జరగని సంఘటన ఇప్పుడు జరిగిందంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు.…