దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకున్నాయి. సింగిల్ స్క్రీన్ల సంగతి అయోమయంగా ఉన్నప్పటికీ.. మల్టీప్లెక్సులైతే నడుస్తున్నాయి. ఆసక్తికరమైన కొత్త సినిమాలు విడుదల చేస్తే ప్రేక్షకులు బాగానే థియేటర్లకు వస్తారని టెనెట్ మూవీకి వస్తున్న స్పందనను బట్టి అర్థమవుతోంది.
ఈ నేపథ్యంలో క్రిస్మస్ సీజన్ మీద నిర్మాతలు దృష్టి పెడుతున్నారు. వివిధ భాషల్లో కాస్త పేరున్న సినిమాలనే ఆ సీజన్లో రిలీజ్ చేయబోతున్నారు. తెలుగు నుంచి సాయిధరమ్ తేజ్ సినిమా సోలో బ్రతుకే సో బెటర్ క్రిస్మస్ రేసులో నిలిచిన సంగతి తెలిసిందే. హిందీలో ఓ హాట్ మూవీ క్రిస్మస్ రిలీజ్‌కు రెడీ అవడం విశేషం. ఆ సినిమానే.. షకీలా.
ఒకప్పుడు సాఫ్ట్ పోర్న్ సినిమాలతో సౌత్ కుర్రాళ్లను ఒక ఊపు ఊపిన షకీలా జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇంద్రజిత్ లంకేష్ దర్శకుడు. ఇందులో షకీలా పాత్రను బాలీవుడ్ భామ రిచా చద్దా పోషించింది. ఈ చిత్రాన్ని డిసెంబరు 25న హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పెద్ద ఎత్తునే రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఖరారు చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్లు సంచలనం రేపుతున్నాయి.
అందులో ఒక పోస్టర్లో బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి కనిపిస్తున్నాడు. వెనుక పోస్టర్లో సౌత్ ఇండియా సూపర్ స్టార్ అని ఉంది. పంకజ్ అవతారమంతా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టిని పోలి ఉంది. ఒకప్పుడు షకీలా సినిమాల హవా ఎక్కువైపోయి అవి తమ చిత్రాల వసూళ్లపై ప్రభావం చూపుతుండటంతో మమ్ముట్టి, మోహన్ లాల్ లాంటి పెద్ద స్టార్లు ఆమెకు బ్రేకులేసే ప్రయత్నం చేయడం తెలిసిందే. దీనిపై షకీలా కూడా ఒకానొక దశలో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు షకీలా సినిమా పోస్టర్లు చూస్తుంటే.. మూవీలో మమ్ముట్టిని టార్గెట్ చేశారేమో అనిపిస్తోంది. మరి సినిమాలో ఏం సంచనాలుంటాయో చూడాలి.
This post was last modified on December 7, 2020 11:23 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…