బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అనిపించేలా తీశారేమో అనిపిస్తుంది. మూడు గంటల ముప్పై రెండు నిమిషాల నిడివి అంటే యానిమల్ రేంజ్ లో ఉంటాయేమోననే అంచనాలు నెలకొన్నాయి. ఇంతా చేసి విడుదల మరికొద్ది గంటల్లో ఉందనగా దురంధర్ మీద నెగటివిటీ పెరిగిపోతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేకపోగా పాటలు, ట్రైలర్లు బజ్ పరంగా జనంలో ఆసక్తి పెంచలేకపోయిందనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీంతో ఓపెనింగ్స్ మీద బోలెడు అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఇలా ఎందుకు జరిగిందనే ప్రశ్న తలెత్తడం సహజం. రణ్వీర్ సింగ్ ని బిగ్ స్క్రీన్ మీద చూసి రెండేళ్లు దాటింది. ఫ్యాన్ బేస్ ఉన్నప్పటికీ వేగంగా సినిమాలు చేయకపోవడం వల్ల ఆడియన్స్ తో కనెక్టివిటీ క్రమంగా తగ్గుతూ పోయింది. దీంతో పాటు యానిమల్ ని స్ఫూర్తిగా తీసుకున్నట్టు అదే తరహా యాక్షన్ బ్లాక్స్, వయొలెన్స్ పెట్టడం ఇంకొంచెం డ్యామేజ్ చేసింది. దర్శకుడు ఆదిత్య దార్ ఏడేళ్ల క్రితం యురి లాంటి అల్టిమేట్ మూవీ ఇచ్చాక చేసిన సినిమా ఇది. అలాంటప్పుడు హైప్ ఇంకా ఎక్కువగా ఉండాలి. దానికి భిన్నంగా ఉత్తరాది ప్రేక్షకుల నుంచి మద్దతు దక్కపోవడం విచిత్రమే.
ఇంకో ట్విస్టు ఏంటంటే ముందు రోజు సాయంత్రమే మీడియాకు స్పెషల్ ప్రీమియర్ సిద్ధం చేసి ఆ మేరకు ఆహ్వానాలు కూడా పంపించారు. సెలబ్రిటీలకు ఒక షో పెట్టారు. ఉన్నట్టుండి వాటిని రద్దు చేయడం అనుమానాలను మరింత పెంచింది. కంటెంట్ గురించి భయపడో లేదా లీక్స్ వెళ్లిపోతాయనే డౌట్ ఏమో కానీ మొత్తానికి ఇది కూడా హాట్ టాపిక్ గా మారింది. మాఫియా, ఉగ్రవాదం, తీవ్రవాదం అన్నీ మిక్స్ చేసిన దురంధర్ కు నిడివే అతి పెద్ద శాపంగా మారనుందని బయ్యర్లు టెన్షన్ పడుతున్నారు. రేపు టాక్ యూనానిమస్ గా వస్తే ఓకే. ఏ మాత్రం తేడా కొట్టినా అంతే సంగతులు.
This post was last modified on December 4, 2025 10:45 pm
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…