కోలీవుడ్ లో నిన్నటిదాకా ఎక్కువ వినిపించిన పేరు అనిరుధ్ రవిచందర్. అయితే కూలితో సహా తన వరస సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వకపోవడంతో మ్యూజిక్ లవర్స్ కొత్త రక్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ టైంలో ఇరవై ఒక్క సంవత్సరాల కుర్రాడు సాయి అభ్యంక్కర్ ఇంద్ర స్టైల్ లో నేనున్నాను అంటూ దూసుకెళ్ళిపోతున్నాడు. ఒక ప్రైవేట్ సాంగ్ ద్వారా యూట్యూబ్ లో పాపులారిటీ తెచ్చుకున్న ఈ అబ్బాయి ఎప్పుడైతే అల్లు అర్జున్ – అట్లీ కాంబో మూవీని దక్కించుకున్నాడో అప్పటి నుంచి ట్రెండింగ్ టాపిక్ అయిపోయాడు. ఇటీవలే విడుదలైన డ్యూడ్ లోనూ మంచి పేరు తెచ్చుకున్నాడు.
ఇతని పనితనం ఏ స్థాయికి వెళ్లిందంటే కమల్ హాసన్ నిర్మాతగా రజనీకాంత్ హీరోగా రూపొందబోయే సినిమాకు సాయి అభ్యంక్కర్ నే సంగీత దర్శకుడిగా ఎంపిక చేసినట్టు చెన్నై టాక్. దర్శకుడు సుందర్ సి ఈ ప్రాజెక్టు వదిలేసిన తర్వాత ఎవరు టేకప్ చేస్తారనే దాని మీద ఇప్పటిదాకా క్లారిటీ లేదు. ఏవేవో పేర్లు ప్రచారంలోకి వచ్చాయి కానీ ఫైనల్ గా పార్కింగ్ ఫేమ్ రామ్ కుమార్ బాలకృష్ణన్ ని లాక్ చేసినట్టు వినికిడి. ఇది కూడా లీకుల రూపంలో వచ్చింది కానీ యూనిట్ అఫీషియల్ గా చెప్పలేదు. మొత్తం అన్నీ ఓకే అనుకున్న తర్వాతే మీడియా, అభిమానులకు చెబుదామని కమల్ హాసన్ డిసైడ్ అయ్యారట.
ఒకరకంగా చెప్పాలంటే సాయి అభ్యంక్కర్ మాములు జాక్ పాట్ కొట్టలేదు. ఎందుకంటే ఇంకా బోలెడు భవిష్యత్తు ఉన్న టైంలో ఇలా క్రేజీ ప్రాజెక్టులు చేతికి రావడమంటే చిన్న విషయం కాదు. లోకేష్ కనగరాజ్ నిర్మాణంలో రూపొందుతున్న బెంజ్ కూడా సాయి అభ్యంక్కర్ చేస్తున్నాడు. ఇవి కాకూండా కార్తీ మార్షల్, సూర్య కరుప్పు తన ఖాతాలోనే ఉన్నాయి. ఇంత వేగంగా దూసుకుపోవడం చూస్తుంటే త్వరలోనే మన టాలీవుడ్ నిర్మాతలు ఎగబడటం ఖాయం. ఇప్పటికీ బన్నీ సినిమా చేస్తున్నాడు కాబట్టి మరిన్ని ఆఫర్లు వెల్లువెత్తుతాయి. ఒక రెండు బ్లాక్ బస్టర్లు పడితే అనిరుధ్ స్థాయికి చేరుకునేలా ఉన్నాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates