దేవుడు, మతం లాంటి వ్యవహారాల్లో వ్యాఖ్యలు చేసేటపుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పడానికి ఈ ఉదంతం ఉదాహరణ. బాలీవుడ్లో వివాద రహితుడిగా పేరున్న సైఫ్ అలీఖాన్.. తాను చేయబోయే కొత్త సినిమా గురించి మాట్లాడుతూ చేసిన ఓ వ్యాఖ్య దుమారం రేపింది. అతను ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న ఆదిపురుష్‌లో రావణుడిని పోలిన లంకేష్ పాత్రకు ఎంపికైన సంగతి తెలిసిందే.
కాగా ఈ సినిమా విశేషాల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాముడు తన చెల్లెలు శూర్పణక ముక్కు కోసినందుకు ప్రతీకారంగా రావణుడు సీతను ఎందుకు అపహరించాడో, రాముడితో ఎందుకు యుద్ధం చేశాడో సహేతుకంగా చూపిస్తామని సైఫ్ వ్యాఖ్యానించడంపై సోషల్ మీడియాలో నిన్నట్నుంచి పెద్ద చర్చే నడుస్తోంది.
రాక్షసుడైన రావణుడిని ఆదిపురుష్‌లో హీరోగా చూపిస్తారా అంటూ చిత్ర బృందాన్ని ప్రశ్నించారు. హిందువుల మనోభావాలు దెబ్బ తీశాడని సైఫ్ మీద మండిపడ్డారు. ఐతే వ్యవహారం సీరియస్ అయ్యేలా ఉందని గ్రహించిన సైఫ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన వివరణ ఇచ్చేశాడు. అతను తన వ్యాఖ్యల పట్ల బేషరతుగా క్షమాపణ చెప్పడమే కాదు.. తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు.
తన వ్యాఖ్యల్లో దురుద్దేశం ఏమీ లేదని.. ఎవరి మనోభావాలూ కించపరచదలుచుకోలేదని అతను పేర్కొన్నాడు. రాముడు మంచికి, వీరత్వానికి ప్రతీక అని.. చెడుపై మంచి విజయాన్ని ప్రతిబింబించేలా ఆదిపురుష్ ఉంటుందని, వాస్తవాలను వక్రీకరించకుండా ఆదిపురుష్‌ను అత్యుత్తమంగా తీర్చిదిద్దే ప్రయత్రం చిత్ర బృందం చేస్తుందని అతను స్పష్టం చేశాడు.
This post was last modified on December 7, 2020 8:58 am
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
బీజేపీ మాతృ సంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్).. తాజాగా కమల నాథులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…