హృతిక్ రోషన్‌కు డెబ్యూ మూవీ కహోనా ప్యార్ హై తర్వాత పెద్ద బ్రేక్ ఇచ్చిన సినిమా.. కోయీ మిల్ గయా. దీనికి కొనసాగింపుగా వచ్చిన క్రిష్, క్రిష్-3 కూడా ఘనవిజయం సాధించాయి. ఈ ఫ్రాంఛైజీలో భాగంగా మరింత భారీగా క్రిష్-4 చేయడానికి చాలా ఏళ్ల ముందే సన్నాహాలు మొదలుపెట్టాడు హృతిక్ తండ్రి, దర్శకుడు రాకేష్ రోషన్. ఈ చిత్రానికి ఎప్పుడో స్క్రిప్టు కూడా రెడీ అయింది. కానీ ఇప్పటిదాకా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. మధ్యలో రాకేష్ క్యాన్సర్ బారిన పడడం వల్ల ఈ ప్రాజెక్టు సందిగ్ధంలో పడింది. ఆయన కోలుకుని సినిమా తీయడానికి రెడీ అయ్యారు.
అయినా క్రిష్-4 కార్యరూపం దాల్చలేదు. అందుకు కారణమేంటో ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు రాకేష్ రోషన్. బడ్జెట్ సమస్యల వల్లే క్రిష్-4ను సెట్స్ మీదికి తీసుకెళ్లలేకపోతున్నట్లు ఆయన తెలిపారు. క్రిష్-4ను అంతర్జాతీయ ప్రమాణాలతోనే తీయాల్సి ఉంటుందని.. అందుకోసం భారీ బడ్జెట్ అవసరమని.. కానీ తాము అనుకున్న బడ్జెట్‌లో సినిమా తీయడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదని ఆయన వెల్లడించారు.
మధ్యలో హృతిక్ రోషన్ స్వయంగా ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి కానీ.. ఇప్పటిదాకా ఆ సినిమా సెట్స్ మీదికి వెళ్లట్లేదు. కారణం ఆర్థిక సమస్యలే అని తెలుస్తోంది. ఐతే ఇంతకుముందు క్రిష్ సిరీస్‌లో వచ్చిన మూడు సినిమాలనూ రోషన్ ఫ్యామిలీనే నిర్మించడం గమనార్హం. కానీ క్రిష్-4 మీద డబ్బులు పెట్టలేకపోతోంది. ఐతే హృతిక్ తండ్రి ఈ విషయంలో ఇబ్బంది పడుతుండగా.. హృతిక్ మాత్రం సొంతంగా భారీ పెట్టుబడులు పెడుతుండడం విశేషం.
తాజాగా అతను ముంబయిలోని జుహులో ఒక ప్రీమియం ప్రాపర్టీ కొన్నాడు. రెండు ఫ్లోర్లతో ఉన్న ఆ ప్రాపర్టీ కోసం అతను ఏకంగా రూ.27 కోట్లు వెచ్చించాడట. 7 వేల చదరపు అడుగుల లగ్జరీ ప్రాపర్టీ ఇదని సమాచారం. ఓవైపు క్రిష్-4 తీయడానికి డబ్బులు సమకూరట్లేదని రాకేష్ బాధ పడుతుంటే.. హృతిక్ ఇలా లగ్జరీ ప్రాపర్టీ కొనడం బాలీవుడ్లో చర్చనీయాంశం అయింది. ఐతే క్రిష్ సిరీస్‌లో ఇప్పటిదాకా తీసిన సినిమాలు వేరు.. క్రిష్-4 వేరని తెలుస్తోంది. దాని కోసం వందల కోట్లు ఖర్చు పెట్టాల్సి రావడంతో హృతిక్ మార్కెట్ దృష్ట్యా అంత బడ్జెట్ పెట్టడానికి వేరే నిర్మాతలు ముందుకు రాలేదని తెలుస్తోంది.
This post was last modified on November 30, 2025 8:41 am
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…