రాజమౌళి తన వారణాసిలో మహేష్ బాబుని రాముడిగా చూపిస్తున్నట్టు అధికారికంగా వెల్లడయ్యాక అందరి చూపు బాలీవుడ్ రామాయణ మీదకు వెళ్తోంది. ఎందుకంటే వచ్చే ఏడాది దీపావళికి విడుదల కాబోతున్న ఈ విజువల్ గ్రాండియర్ ఏకంగా నాలుగు వేల కోట్లతో రూపొందుతోందని ఇప్పటికే టాక్ ఉంది. రాముడిగా రన్బీర్ కపూర్ లుక్ ఎలా ఉంటుంది, ఎలాంటి పెర్ఫార్మన్స్ ఇస్తాడనే దాని మీద బాలీవుడ్ వర్గాల్లో ఓ రేంజ్ అంచనాలున్నాయి. రిలీజయ్యేది మొదటి భాగమే కాబట్టి దాంతో ఏర్పడే హైప్ తో పార్ట్ 2ని ఇంకా పెద్ద ఎత్తున రిలీజ్ చేయాలన్నది దర్శకుడు నితీష్ తివారి ఆలోచన. ఇక్కడిదాకా బాగానే ఉంది.
మహేష్ బాబు, రన్బీర్ కపూర్ లో ఎవరు రాముడిగా పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతారనే డిబేట్ నిజానికి అనవసరం. ఎందుకంటే వారణాసిలో మహేష్ కేవలం ఒక ఎపిసోడ్ మాత్రమే సీతాసతుడిగా కనిపిస్తాడు. మిగిలినదంతా వర్తమానం, గతం, భవిష్యత్తు మీద విభిన్న బ్యాక్ డ్రాప్స్ లో ఉంటుంది. సో రాముడి లెన్త్ పరిమితం కాబట్టి అతిగా ఊహించుకోవడానికి లేదు. అలాని పావు గంటైనా అరగంటైనా రాజమౌళి ఇచ్చే ఇంపాక్ట్ మాములుగా ఉండదు. కానీ హిందీ రామాయణ అలా కాదు. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి శుభం కార్డు దాకా రన్బీర్ కపూర్ రాముడిగానే ఉంటాడు. ఇంకెలాంటి డైవెర్షన్లు ఇతరత్రా సెటప్ లు ఉండవు.
అయినా రాముడిగా కేవలం ఒక్కరు మాత్రం పర్ఫెక్ట్ ఛాయస్ అవుతారని చెప్పడానికి లేదు. ఎందుకంటే లవకుశలో రాముడి రూపంలో ఎన్టీఆర్ ని చూశాక చాలా ఏళ్ళ పాటు వేరొకరు ఆ పాత్ర ధరించే సాహసం చేయలేదు. చాలా గ్యాప్ తర్వాత శోభన్ బాబు సంపూర్ణ రామాయణంలో శబాష్ అనిపించుకున్నారు. శ్రీరామరాజ్యంలో బాలకృష్ణకు మంచి మార్కులు పడ్డాయి. శ్రీరామదాసులో సుమన్ రైట్ ఛాయస్ అనిపించుకున్నారు. ఓం రౌత్ సరిగా తీయలేదు కానీ ఆదిపురుష్ లో ప్రభాస్ కూడా బెస్ట్ అనిపించుకునేవాడు. సో రేపు రన్బీర్ అయినా మహేష్ అయినా దర్శకులు ఎలా ప్రెజెంట్ చేస్తారనేది విజయాన్ని శాశించనుంది.
This post was last modified on November 27, 2025 10:33 am
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…