టాలీవుడ్ నుంచి ఈ మధ్య ఇంత పెద్ద ఛార్ట్ బస్టర్ సాంగ్ రాలేదనేది వాస్తవం. చికిరి చికిరి ప్రపంచవ్యాప్తంగా రీచ్ అవుతున్న విధానం చూసి ఫ్యాన్స్ షాకవుతున్నారు. ఏఆర్ రెహమాన్ మీద అంతంత మాత్రం నమ్మకం పెట్టుకున్న టైంలో ఏకంగా నేపాల్, దుబాయ్ లాంటి దేశాల్లోనూ రీల్స్ చేసే స్థాయిలో చికిరి చికిరి వ్యూస్ తెచ్చుకోవడం ఆషామాషీ విషయం కాదు. తెలుగు వెర్షనే అరవై అయిదు మిలియన్ల వీక్షణలు దాటేసి ఏకంగా వన్ మిలియన్ లైక్స్ నమోదు చేయడం చెప్పుకోదగ్గ రికార్డే. కేవలం ఈ ఒక్క పాటతోనే బిజినెస్ క్రేజ్ అమాంతం పెరిగిపోవడం అబద్దం కాదు. అంత క్రేజ్ సంపాదించేసుకుంది.
అయితే ఇంత పెద్ద సక్సెస్ వెనుక క్రెడిట్ ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరమైన ప్రశ్న. అందరికీ సమాన వాటా ఉన్నప్పటికీ ముందు దర్శకుడు బుచ్చిబాబుకి ఎక్కువ శాతం ఇవ్వాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మణిరత్నం లాంటి లెజెండరీ ఫిలిం మేకర్ సైతం రెహమాన్ నుంచి బెస్ట్ రాబట్టుకోలేకపోయారు. అలాంటిది తెలుగు స్ట్రెయిట్ సినిమాకు వైరల్ సాంగ్ చేయించుకోవడం అనేది నిజంగా ఘనతే. రెండోది రామ్ చరణ్ కు ఇవ్వాలి. ఒకప్పటి రచ్చ రోజులను గుర్తు చేస్తూ వేసిన స్టెప్పులు జనాన్ని మాములుగా ఊపేయలేదు. ఇక రెహమాన్ కంపోజింగ్ సంగతి సరేసరి. గాయకుడిగా మోహిత్ ని ఎంచుకోడం దగ్గరే సగం హిట్టు కొట్టేశారు.
అలాని కెమెరామెన్ రత్నవేలు, ఇంత లావిష్ గా ఖర్చు పెట్టిన నిర్మాతలను పక్కన పెట్టలేం. ప్రతిఒక్కరి సమిష్టి కృషి వల్లే చికిరి చికిరి ఇంత పెద్ద రేంజ్ కు చేరుకుంది. నెక్స్ట్ రాబోయే పాటల మీద అప్పుడే అంచనాలు ఒత్తిడి మొదలైపోయాయి. వాటిని రెహమాన్, బుచ్చిబాబు అందుకోవాలి. ఏ మాత్రం మోతాదు తగ్గినా మూవీ లవర్స్ నిరాశ పడతారు. దానికి అనుగుణంగానే నెక్స్ట్ పాట ఉందనేది ఇన్ సైడ్ టాక్. మార్చి 27 విడుదల కాబోతున్న పెద్ది ఎట్టి పరిస్థితుల్లో చెప్పిన డేట్ కి రావడం పక్కానే . వాయిదాకు ఒక్క శాతం ఛాన్స్ కూడా లేదని, ప్లానింగ్ దానికి అనుగుణంగా పక్కాగా ఉందని యూనిట్ నుంచి వినిపిస్తున్న మాట.
Gulte Telugu Telugu Political and Movie News Updates