బిగ్‍బాస్ సీజన్ 4 మరికొద్ది రోజుల్లో ముగుస్తుంది. ఈ వారాంతంలో ఒక కంటెస్టెంట్ ఇంటిదారి పట్టడంతో చివరకు మిగిలే ఆ అయిదుగురు ఎవరనేది వచ్చే వారం నామినేషన్లలో తేలుతుంది. టీవీ సీరియల్ నటుడు అఖిల్ సార్ధక్ ఆల్రెడీ ఫైనల్ చేరిపోయాడు. టికెట్ టు ఫినాలే పోటీలో అఖిల్‍కి ఫైనల్ టికెట్ దక్కినట్టు తెలిసింది.
ఇక మిగతా ఆరుగురి మధ్య నంబర్ల గేమ్ ఒకటి నిర్వహించారట. అందులో అంతా కలిసి అభిజీత్‍కి ఆరవ స్థానం కట్టబెట్టారట. దాంతో అతడిని బిగ్‍బాస్ జైలుకి పంపించాడట. హౌస్‍లో వున్న సభ్యులు అభిజీత్‍కి ఫైనల్‍కొచ్చే అర్హత లేదనుకుంటున్నారు కానీ వాస్తవానికి అతడే విజేతగా నిలబడతాడనిపిస్తోంది. బిగ్‍బాస్ టీమ్ అతడిని ఎంతగా టార్గెట్ చేస్తున్నా కానీ అభిజీత్‍కి ఓట్లు మాత్రం బాగా పడుతున్నాయి.
అతను గొప్పగా ఆడిందేమీ లేకపోయినా కానీ మిగతా సభ్యుల కంటే జ్ఞానం, పరిణతి వుండడం అభిజీత్‍కి ప్లస్ అయ్యాయి. అలాగే అతడి కోసం ఆదినుంచీ పీఆర్ టీమ్ గట్టిగా పని చేస్తోంది. నాలుగైదు వారాల పాటు పీఆర్ టీమ్ అతడిని హైప్ చేసి వదిలితే అక్కడ్నుంచీ నెమ్మదిగా కామన్ ఆడియన్స్ కూడా అటు మొగ్గడం మొదలయింది. అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటే తప్ప బిగ్‍బాస్ సీజన్ 4 టైటిల్ అభిజీత్ వశమవుతుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates