నిన్న విడుదలైన పదేసి పైగా సినిమాల్లో మంచి ఆక్యుపెన్సీలు కనిపించింది ఒక్క రాజు వెడ్స్ రాంబాయికి మాత్రమే. మిగిలిన వాటిలో టీమే సైలెంట్ అయ్యేంతగా 12 ఏ రైల్వేకాలనీ బ్యాడ్ టాక్ తెచ్చుకోగా, ప్రేమంటే, పాంచ్ మినార్ లు రిలీజైన సంగతే తమకు తెలియదన్నట్టుగా ఆడియన్స్ లైట్ తీసుకున్నారు. రిపోర్ట్స్ కూడా ఏమంత ఆశాజనకంగా లేకపోవడం ఏ మేరకు ప్రభావం చూపిస్తాయో చూడాలి. ఇక చాలా కష్టపడి బెస్ట్ రీ మాస్టరింగ్ చేసుకున్న కొదమసింహం సైతం పలు చోట్ల డెఫిషిట్లు నమోదు చేసింది. శివ స్థాయిలో కాకపోయినా అందులో సగం స్పందనైనా దక్కుతుందేమోనని ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్ కి నిరాశే మిగిలింది.
ఇక రాజు వెడ్స్ రాంబాయి విషయానికి వస్తే మరీ ఎక్స్ ట్రాడినరి అనిపించుకోకపోయినా ఉన్నంతలో సిన్సియర్ గా చెప్పిన ప్రేమకథనే టాక్ తెచ్చుకోవడం యూత్ ని థియేటర్లకు రప్పిస్తోంది. మొదటి రోజు 99 రూపాయల టికెట్ ప్లాన్ బ్రహ్మాండంగా వర్కౌట్ అయ్యింది. నిన్న సెకండ్ షోలు చాలా చోట్ల హౌస్ ఫుల్ అయ్యాయి. అయితే ఏపీ తెలంగాణలోని పలు థియేటర్లు మల్టీప్లెక్సులు హఠాత్తుగా రేట్లు మార్చి పాత ధరలే పెట్టడం షాకనే చెప్పాలి. వీకెండ్ ని క్యాష్ చేసుకోవడం గురించి కావొచ్చు. అయితే నిర్మాతలు ఎక్కడా కేవలం ఒక్క రోజే 99 రూపాయలఐ చెప్పకపోవడం గమనించాల్సిన విషయం.
బుక్ మై షోలో సగటున గంటకు మూడు వేలదాకా టికెట్లు అమ్ముడుపోతున్న కొత్త రిలీజు ఇదొక్కటే. క్లైమాక్స్ గురించి సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం, టీమ్ తెలివిగా దాన్ని వాడుకున్న వైనం, ఈవెంట్లలో దర్శకుడు చేసిన ఛాలెంజ్ ఇవన్నీ సానుకూలంగా పని చేశాయి. నైజామ్ లోనే కోటి దగ్గరగా వసూళ్లు వచ్చాయని టాక్. ఓవరాల్ నెంబర్లు ఇంకా వదలాల్సి ఉంది. ఏది ఏమైనా అల్లరి నరేష్, అర్జున్ సర్జా, రాజ్ తరుణ్, ప్రియదర్శి లాంటి నోటెడ్ హీరోల సినిమాల కన్నా ఒక కొత్త జంట నటించిన రా లవ్ స్టోరీకి ఇంత స్పందన దక్కడం విశేషం. ఇదే దూకుడు వీకెండ్ తర్వాత కూడా ఉంటే బొమ్మ మీద సూపర్ హిట్ ముద్ర పడిపోతుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates