మన దగ్గర ఇంకో నెల రోజుల్లో థియేటర్లు పూర్తి స్థాయిలో నడుస్తాయన్న ఆశతో సంక్రాంతికి అడరజను దాకా సినిమాలు రిలీజ్ చేయడానికి కర్చీఫ్‌లు వేసుకుని కూర్చుని ఉన్నారు నిర్మాతలు. ఇందులో చాలా వరకు సినిమాలు ఎప్పుడో పూర్తయినవి. థియేటర్లు తెరుచుకున్నాకే సినిమాలను రిలీజ్ చేస్తామని వాటి నిర్మాతలు భీష్మించుకుని కూర్చున్నారు. ఓటీటీల నుంచి ఆఫర్లు వచ్చినా తిరస్కరిస్తూనే వచ్చారు. కొత్త ఏడాదిలో పరిస్థితులంతా మారిపోతాయని.. ఓటీటీల హవాకు తెరపడుతుందని, థియేటర్లు మళ్లీ కళకళలాడుతాయని వాళ్లు ఆశిస్తున్నారు.
ఐతే కొత్త ఏడాదిలో కూడా కరోనా ప్రభావం కొనసాగుతుందని.. వచ్చే ఏడాది కూడా థియేటర్లకు కష్టాలు తప్పవని సంకేతాలు అందుతున్నాయి. ఈ విషయాన్ని అర్థం చేసుకుని ప్రఖ్యాత హాలీవుడ్ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది.
తమ సంస్థలో ఇప్పటికే పూర్తయిన, త్వరలో పూర్తి కానున్న సినిమాలన్నీ కలిపి 15 దాకా కొత్త ఏడాదిలో విడుదల కావల్సి ఉండగా.. వాటిని ఇటు థియేటర్లలో, అటు ఓటీటీల్లో ఒకేసారి విడుదల చేయాలని వార్నర్ బ్రదర్స్ నిర్ణయించుకుంది. ఈ సంస్థలో డ్యూన్, ది సుసైడ్ స్క్వాడ్, టామ్ అండ్ జెర్రీ, ది కంజూరింగ్: ది డెవిల్ మేక్ మి డు ఇట్, కింగ్ రిచర్డ్, జుడాస్ అండ్ ద బ్లాక్ మెస్సయా లాంటి భారీ చిత్రాలు ఈ సంస్థలో ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. వీటిని కేవలం థియేటర్లలో మాత్రమే విడుదల చేస్తే ఆశించిన రెవెన్యూ రాదని అర్థం చేసుకుంది వార్నర్ బ్రదర్స్. ఇవన్నీ కూడా 2021లో విడుదల కావాల్సిన సినిమాలే.
ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల పరిస్థితి ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంది. అన్ని చోట్లా పూర్తి స్థాయిలో థియేటర్లు నడవడానికి ఇంకో ఏడాది సమయం పట్టేలా ఉంది. ఈ ఏడాది ‘టెనెట్’ లాంటి భారీ చిత్రాన్ని ధైర్యం చేసి రిలీజ్ చేస్తే అంచనాల్లో సగం ఆదాయం కూడా రాలేదు. ఈ నేపథ్యంలో హెచ్‌బీవో మ్యాక్స్ ఓటీటీతో వార్నర్ బ్రదర్స్ ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం ఒకేసారి అందుబాటులో ఉన్న థియేటర్లలో, అలాగే హెచ్‌బీవోలో వార్నర్ బ్రదర్స్ సినిమాలు రిలీజవుతాయి.
This post was last modified on December 4, 2020 2:53 pm
టాలీవుడ్ లో విలన్ల కొరత వాస్తవం. ఎంత బాలీవుడ్ నుంచి కొందరిని తీసుకొచ్చినా నేటివిటీ సమస్య వల్ల ఒరిజినాలిటి రావడం…
మొన్న శుక్రవారం కోర్ట్ హడావిడిలో పడి వేరే కొత్త సినిమాలు పట్టించుకోలేదు కానీ వాటిలో మలయాళం డబ్బింగ్ 'ఆఫీసర్ ఆన్…
సోషల్ మీడియాలో శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఎంట్రీ ఇచ్చిన ఓ అడ్వర్టైజ్ మెంట్ హోర్డింగ్ జనాలను విశేషంగా ఆకట్టుకుంటోంది.…
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై తమిళనాడుకు చెందిన అధికార పార్టీ డీఎంకే నాయకులు వరుస పెట్టి విమర్శలు…
మహా కుంభమేళా, భక్తులకే కాదు, వ్యాపారస్తులకు కూడా అపారమైన ఆదాయాన్ని అందించే అవకాశాన్ని కల్పిస్తుంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఇటీవల జరిగిన…
ఇంకో నలభై రోజుల్లో విడుదల కాబోతున్న కన్నప్ప కోసం మంచు విష్ణు ఇప్పటి నుంచే ప్రమోషన్లు మొదలుపెట్టాడు. ఇంటర్వ్యూలతో పాటు…