Movie News

బైకు గేర్లు మార్చాలి శర్వా

డిసెంబర్ 5 రిలీజవుతున్న అఖండ 2 గురించే జనాలు మాట్లాడుకుంటున్నారు కానీ ఒక రోజు ఆలస్యంగా డిసెంబర్ 6 బైకర్ వస్తోందన్న సంగతి జనాలకు చెబితే కానీ గుర్తు రావడం లేదు. శర్వానంద్ హీరోగా రూపొందిన ఈ బైక్ ఛేజ్ స్పోర్ట్స్ డ్రామాకు అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించారు. శర్వానంద్ దీని కోసం చాలా కష్టపడ్డాడు. విపరీతమైన డైట్ ఫాలో అవుతూ చాలా బరువు తగ్గి సన్నబడ్డాడు. కుర్రాడిగా కనిపించేందుకు ఎంత చేయాలో అంతకన్నా ఎక్కువే చేశాడు. అఖండ 2తో పోటీ అంటే ఆషామాషీ కాదు. పాజిటివ్ టాక్ వస్తే బాలయ్య చేసే బాక్సాఫీస్ రచ్చ మాములుగా ఉండదు. ఏ మాత్రం తేలిగ్గా తీసుకోవడానికి లేదు.

మూడు రోజుల క్రితం వీడియో సాంగ్ వచ్చిన విషయం అంతగా హైలైట్ కాలేకపోయింది. డాక్టర్ రాజశేఖర్ ఇందులో కీలక పాత్ర పోషించారు. ఆయనను మార్కెటింగ్ కి వాడుకుంటే బజ్ మరింత పెరుగుతుంది. టీజర్ తో యూత్ లో అటెన్షన్ వచ్చింది కానీ స్ట్రాంగ్ ఓపెనింగ్స్ కి అదొక్కటే సరిపోదు. వీలైనన్ని పబ్లిసిటీ అస్త్రాలు వాడాలి. ప్రమోషన్స్ లో ప్రతిదీ నెమ్మదిగా సాగుతుంది. బైకర్ కు అలా ఉంటే సరిపోదు. ఏదైనా వైరల్ కంటెంట్ వదలాలి. జనాలు దీని వైపు చూసేలా ఏదైనా ప్లాన్ చేసుకోవాలి. దర్శకుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండటం వల్ల ఫోకస్ చేయలేకపోతున్నారట.

మనమే తర్వాత గ్యాప్ తీసుకున్న శర్వానంద్ దీని మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న నారి నారి నడుమ మురారికి ఈ బైకర్ సక్సెస్ మంచి బూస్ట్ అవుతుందని ఫాన్స్ భావిస్తున్నారు. మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని దర్శకుడు ఏకంగా హాలీవుడ్ మూవీ ఎఫ్ 1 తో పోల్చిన సంగతి తెలిసిందే. మరి అంత గొప్పగా చెప్పినప్పుడు దానికి తగ్గట్టే సోషల్ మీడియా, బయట హడావిడి చేయాలి. అఖండ 2తో పాటు బైకర్ కు దురంధర్ తో పోటీ ఉంది. ఓటిటి ఒప్పందం వల్ల బైకర్ వాయిదా వేసే ఛాన్స్ లేదని ఇన్ సైడ్ టాక్. చూడాలి మరి ఏం జరగనుందో.

This post was last modified on November 21, 2025 9:13 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రామ్ టీమ్… గ్రౌండ్ రియాలిటీ తాలూకా

మాములుగా ఒక సినిమా రిలీజయ్యాక దాని ఫలితంతో సంబంధం లేకుండా సక్సెస్ మీట్ల పేరుతో బాణా సంచా కాల్చడం, మీడియా…

8 hours ago

అమిత్ షాతో మంత్రి లోకేష్ భేటీ, కారణం ఏంటి?

ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్‌.. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో…

8 hours ago

జగన్ ‘అరటి’ విమర్శల్లో నిజమెంత?

ఏపీలో అరటి పండ్ల ధర ఎంత..? ఎందుకీ రాద్దాంతం..? అరటి రైతులు కష్టాలు పడుతున్నారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు చర్చకు…

8 hours ago

‘కోనసీమ పచ్చదనం’.. జనసేన పార్టీ ఫస్ట్ రియాక్షన్

ఉప ముఖ్యమంత్రి మాటలను వక్రీకరించ వద్దంటూ జనసేన ఓ పార్టీ ప్రకటన విడుదల చేసింది. కొద్దిరోజుల కిందట పవన్ కళ్యాణ్…

9 hours ago

పీఎంవో పేరు-భ‌వ‌నం కూడా మార్పు.. అవేంటంటే!

దేశంలో పురాత‌న, బ్రిటీష్ కాలం నాటి పేర్ల‌ను, ఊర్ల‌ను కూడా మారుస్తున్న కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీయే ప్ర‌భుత్వం…

9 hours ago

‘రాజధాని రైతులను ఒప్పించాలి కానీ నొప్పించకూడదు’

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని ప్ర‌పంచ స్థాయి మ‌హాన‌గ‌రంగా నిర్మించాల‌ని నిర్ణ‌యించుకున్న సీఎం చంద్ర‌బాబు.. ఆదిశ‌గా వ‌డి వ‌డిగా అడుగులు వేస్తున్నారు.…

10 hours ago