గత నెలాఖరున విడుదలైన మాస్ జాతర యూనానిమస్ ఫెయిల్యూర్ అనేది అందరూ ఒప్పుకునే వాస్తవం. మరీ రొటీన్ కంటెంట్ తో దర్శకుడు భాను భోగవరపు తనకు దక్కిన తొలి అవకాశాన్ని వృథా చేసుకున్నాడనే కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. ధమాకా స్థాయిలో రవితేజ, శ్రీలీల కాంబో మేజిక్ చేస్తుందనుకుంటే అదీ జరగలేదు. పోనీ భీమ్స్ సిసిరోలియో పాటలైనా కొంత రిలీఫ్ ఇచ్చి ఉంటే బాగుండేది కానీ అదీ జరగలేదు. రవితేజ ఫలితం తెలిసిన వెంటనే దాని గురించి మాట్లాడ్డం లేదు. నిర్మాత నాగవంశీ తొలి రెండు మూడు రోజులు కాసిన్ని ట్వీట్లు వేసి తర్వాత వదిలేశారు. ఇదీ మాస్ జాతర గడిచిన స్టోరీ.
ఇప్పుడు వర్తమానానికి వద్దాం. మాస్ జాతర థియేటర్ రన్ అయిపోలేదు. ఇంకా మెయిన్ సెంటర్స్ లో కొనసాగుతూనే ఉంది. మొన్న ఆదివారం వీకెండ్ చాలా చోట్ల కాస్త నెంబర్లు కనిపించాయి. ది గర్ల్ ఫ్రెండ్ తో సమానంగా అనిపించే వసూళ్లు కొన్ని మాస్ సెంటర్స్ లో నమోదయ్యాయి. అంటే మాస్ ఆడియన్స్ కు ఇది తప్ప మార్కెట్ లో వేరే ఆప్షన్ లేదు. రొటీన్ గా ఉన్నా సరే ఎంటర్ టైన్మెంట్, ఫైట్స్, పాటలు ఉంటే చాలనుకునే వాళ్లకు థియేటర్లలో ఏ సినిమా లేదు. కాంత లాంటివి సెలెక్టెడ్ ప్రేక్షకులను టార్గెట్ చేసుకోవడంతో మాస్ వర్గం లోటుగా ఫీలవుతోంది. అందుకే మాస్ జాతరకు ఓటేశారు.
ఎవరు ఔనన్నా కాదన్నా థియేటర్లకు మహారాజ పోషకులు మాస్ జనాలే. సోషల్ మీడియాతో సంబంధం లేకుండా, టాక్స్ రివ్యూస్ ఎక్కువగా పట్టించుకోకుండా పోస్టర్లు క్యాస్టింగ్ చూసి ఒక్కసారైనా చూసే బాపతు తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఉన్నారు. లేదంటే ఈపాటికి మాస్ జాతర అన్ని చోట్ల తీసేసి ఉండాలి. త్వరలో ఓటిటి స్ట్రీమింగ్ కు రెడీ కాబోతున్న మాస్ జాతరకు డేట్ ఇంకా డిసైడ్ కాలేదట. ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం నాలుగు వారాలు అంటే నవంబర్ చివర్లో వచ్చే అవకాశముంది. నెట్ ఫ్లిక్స్ హక్కులు కొనుగోలు చేసింది. ముందే రిలీజ్ చేసే ప్రతిపాదన ఉందట కానీ ఇంకా ఫైనల్ కాలేదు.
This post was last modified on November 19, 2025 2:46 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…