చాలా అంటే చాలా గ్యాప్ తర్వాత మహేష్ బాబు పబ్లిక్ స్టేజి మీద దర్శనమిచ్చాడు. గుంటూరు కారం ప్రమోషన్ల తర్వాత మళ్ళీ ఎప్పుడూ తన ఫ్యాన్స్ ని కలుసుకునే అవకాశం దక్కలేదు. అప్పుడప్పుడు బయట వేడుకలకు వస్తున్నా మీడియాతో కానీ బయట వాళ్ళతో కానీ మాట్లాడ్డం సాధ్యపడలేదు. అందుకే గ్లోబ్ ట్రాట్టింగ్ ఈవెంట్ కోసం అభిమానులు తపించిపోయారు. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి రామోజీ ఫిలిం సిటీకి వెళ్లేదారులన్నీ కిక్కిరిసిపోయాయంటే ఏ స్థాయిలో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అందులోనూ రాజమౌళి కాంబో కావడంతో అంచనాలు ఆకాశంలో పెట్టుకుని ప్రతి ఒక్కరు విపరీతమైన ఎగ్జైట్ మెంట్ తో కనిపించారు.
ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ వారణాసి తన డ్రీం ప్రాజెక్టని, తండ్రి కృష్ణ పౌరాణికాలు చేయమని చెప్పినా వినలేదని, కానీ ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నదంతా వింటూ ఉంటారని ఆనందం వ్యక్తం చేశాడు. దీని కోసం ఎంత కష్టపడాలో అంతా పడతానని, ప్రతి ఒక్కరు గర్వపడేలా చేస్తానని, ముఖ్యంగా నా దర్శకుడు రాజమౌళి కోసం అని చెప్పగానే ఒక్కసారిగా ఆ ఎమోషన్ మహేష్ కళ్ళలో కనిపించింది. వారణాసి విడుదలయ్యాక దేశమంతా గర్వంగా ఫీలవుతుందని చెప్పిన మహేష్, ఇప్పుడీ అప్డేట్ కేవలం టైటిలేనని ముందు ముందు చాలా చూస్తారని ఊరించడం స్పీచ్ లోని కొసమెరుపు.
మహేష్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే కెరీర్ మొత్తంలో ఇరవై ఎనిమిది సినిమాల ప్రయాణంలో దేనికీ పెట్టనంత ఎఫర్ట్ వారణాసికే పెడుతున్నట్టు అర్థమవుతోంది. రాముడిగా, వీరుడిగా ఇలా పలు షేడ్స్ లో జక్కన్న మహేష్ ని ఎలా చూపిస్తాడోనని ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. ఇవాళ విడుదల చేసిన ట్రైలర్ కేవలం కాన్సెప్ట్ కు సంబంధించినది కావడంతో అసలు మూవీలోని విజువల్స్ బయట పెట్టలేదు. ఇంకా షూటింగ్ కీలక భాగం జరగాల్సి ఉంది. అయినా ఈ కాన్సెప్ట్ వీడియోకే ఒక్క సంవత్సరం పట్టిందంటే అసలు సినిమాకు ఇంకెంత సమయం కావాలో. 2027లో రిలీజవ్వాలని సినీ ప్రియుల కోరిక.
This post was last modified on November 15, 2025 11:16 pm
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…