తెలుగు ప్రేక్షకులకు రాముడు అంటే గుర్తొచ్చే రూపం స్వర్గీయ నందమూరి తారకరామారావుగారే. కృష్ణుడి పాత్రల ద్వారానే ఎక్కువ పాపులారిటీ వచ్చినప్పటికీ లవకుశలో ఆయన దివ్యమంగళ దర్శనం జరిగాక వేరొకరిని ఆ క్యారెక్టర్ లో చూసేందుకు జనం ఇష్టపడేవాళ్లు కాదు. అందుకే సంవత్సరాల తరబడి ఎవరు ఆ రిస్క్ చేయలేకపోయారు. అక్కినేని నాగేశ్వరరావుగారిని అడిగినా ఒప్పుకోలేదు. అంతగా ఎన్టీఆర్ ప్రభావం ఆడియన్స్ మీద ఉండేది. తర్వాత సంపూర్ణ రామాయణంలో శోభన్ బాబుని రాముడిగా అద్భుతంగా చూపించిన దర్శకులు బాపు ప్రేక్షకులను ఒప్పించడంలో విజయం సాధించారు. అంత క్లిష్టమైన బాధ్యత ఇది.
ఇప్పుడు ఇన్ని దశాబ్దాల తర్వాత రాముడిగా మహేష్ బాబుని చూపించబోతున్నారు రాజమౌళి. ఒక కీలకమైన్ ఎపిసోడ్ కోసం ఫోటో షూట్ చేశాక వాల్ పేపర్ గా తన ఫోటోనే పెట్టుకున్నానని చెప్పిన జక్కన్న మళ్ళీ ఎవరైనా చూస్తారేమోనని డిలీట్ చేశానని చెప్పుకొచ్చారు. తనకే గూస్ బంప్స్ వచ్చే స్థాయిలో మహేష్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడని ఆనందం వ్యక్తం చేశారు. కొంటె కృష్ణుడిగా కనిపించే మహేష్ సౌమ్యుడైన రాముడిగా సూటవుతాడా అనే అనుమానం పూర్తిగా తొలగిపోయిందని, ఈ ఎపిసోడ్ రాస్తున్నప్పుడు తీస్తున్నప్పుడు గాల్లో తేలిన ఫీలింగ్ కలుగుతోందని ఊహించని పెద్ద స్థాయిలో ఎలివేషన్ ఇచ్చారు.
రాజమౌళి మాటల ప్రకారం మహేష్ బాబు విశ్వరూపం చూపించేది బహుశా రాముడి అవతారంలోనే కావొచ్చు. ఇక్కడ విజయేంద్రప్రసాద్ అన్న మాటలను లింక్ చేసుకుంటే మ్యాటర్ అర్థమైపోతుంది. రాముడిగా ఆదిపురుష్ లో ప్రభాస్ కూడా చేశాడు కానీ సినిమాతో పాటు డార్లింగ్ లుక్స్ మీద మిశ్రమ స్పందన వచ్చింది. ఓం రౌత్ సరిగా వాడుకుని ఉంటే నెగటివ్ కామెంట్స్ వచ్చేవి కాదు కానీ ఛాన్స్ మిస్ చేశాడు. కానీ ఇప్పుడు మహేష్ ని హ్యాండిల్ చేస్తోంది రాజమౌళి. సో అంచనాలు ఎంత పెట్టుకున్నా దానికి మించిన అవుట్ ఫుట్ ఇస్తాడని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే ఎక్కువ వెయిట్ చేయాలి.
This post was last modified on November 15, 2025 10:33 pm
నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమాకు రిలీజ్ ముందు రోజు రాత్రి…
కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి విద్యపై ఆసక్తి, పట్టుదల తోడైంది. దీంతో చదువులో అత్యుత్తమ ఫలితాలను సాధించి ఇతర ఖైదీలకు…
జీవితం అన్నీ నేర్పిస్తుంది. కష్టాలు ఎలా జీవించాలో నేర్పిస్థాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కవిత కుమారి. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా,…
మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు…
ఇప్పుడు డబ్బుతో పాటు అన్ని సౌకర్యాలూ ఉన్నా సరే.. ఏమీ లేని ఒకప్పటి రోజులే బాగున్నాయి అనుకునేవాళ్లు చాలామందే ఉంటారు.…
ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కేవలం వెంకటేష్ అభిమానులకే కాదు ఇతర హీరోలు, నిర్మాతలకు కూడా సంకటంగా…