యావత్ టాలీవుడ్ ప్రేక్షకులే కాదు సినీ లోకం మొత్తం ఇవాళ గ్లోబ్ ట్రాట్టర్ ఈవెంట్ మీద దృష్టి పెట్టింది. రామోజీ ఫిలిం సిటీలో జరిగిన వేడుకలో వేలాది అభిమానులు పోటెత్తగా ఆన్ లైన్ జియో హాట్ స్టార్ ద్వారా చూస్తున్న ఆడియన్స్ కోట్లలో ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఇంత ఎగ్జైట్ మెంట్ చూపించిన ఓపెన్ ఈవెంట్ ఏదీ లేదని చెప్పాలి. నిర్వాహకులు పోలీసుల సహాయంతో చాలా జాగ్రత్తలు తీసుకోవడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ఫంక్షన్ చాలా స్మూత్ గా జరిగిపోయింది. ఈ సందర్భంగా రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ ఒక ముఖ్యమైన ఎపిసోడ్ గురించి షేర్ చేసుకున్నారు.
ఈ మూవీలో ఒక అరగంట యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది. ఎలాంటి సిజి, విజువల్ ఎఫెక్ట్స్, రీ రికార్డింగ్ లేకుండా చూస్తేనే మహేష్ బాబు విశ్వరూపం కనిపించింది. ఏదైనా తిరుపతి లాంటి గుడికి వెళ్ళినప్పుడు ఎలాంటి భావన కలుగుతుందో ఈ సినిమాలో కొన్ని ఎపిసోడ్స్ అలానే అనిపించాయని ఓ రేంజ్ లో ఎలివేషన్స్ ఇచ్చారు. ఇంతకీ ఈ ముప్పై నిమిషాల ట్రాక్ ఏంటి, ఏ సందర్భంలో వస్తుందనేది మాత్రం చెప్పలేదు. ఎంతైనా ఫాదరాఫ్ జక్కన్న కదా. ఎలా బయటపడతారు. ఇది విన్న ఫ్యాన్స్ కేకలు ప్రాంగణం మొత్తం హోరెత్తాయి. ఇంతకన్నా ఎక్కువ డీటెయిల్స్ విజయేంద్ర ప్రసాద్ పంచుకోలేదు.
వారణాసినే టైటిల్ గా కన్ఫర్మ్ అయ్యిందని చెప్పబడుతున్న ఈ ప్యాన్ ఇండియా మూవీకి సంబంధించిన మొదటి ప్రమోషనల్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. అంచనాలకు తగ్గట్టే జన సందోహం రావడం, ఎక్కడా ఎలాంటి అపశ్రుతి కలగకపోవడం సంతోషాన్ని కలిగించాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడంతో వరల్డ్ వైడ్ ఫిలిం మేకర్స్ సైతం దీని పట్ల చాలా ఆసక్తిగా ఉన్నారు. విడుదల తేదీ ఇంకా దూరంలో ఉంది కానీ ఉద్వేగం మాత్రం అందరికి ఆణువణువులో ఉంది. మొదటి అడుగుని దిగ్విజయంగా పూర్తి చేసిన రాజమౌళి టీమ్ నుంచి నెక్స్ట్ స్టెప్ ఏది కానుందో చూడాలి.
This post was last modified on November 15, 2025 8:59 pm
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…