అల్లు అర్జున్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ సినిమా.. నా పేరు సూర్య. కంటెంట్ పరంగా మరీ తీసిపడేయదగ్గ సినిమా కాదు కానీ.. భారీ బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం అంచనాల్ని అందుకోవడంలో విఫలమై బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఫలితాన్నందుకుంది. ఐతే ఈ సినిమా డబ్బింగ్ వెర్షన్ ఇప్పుడు ఉత్తరాదిన థియేటర్లలో మంచి ఫలితం సాధించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
సూర్య ది సోల్జర్ పేరుతో ఇప్పటికే ఈ సినిమా హిందీలో అనువాదమై యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది. అక్కడ దానికి మంచి స్పందన వచ్చింది. కాగా కరోనా-లాక్ డౌన్ తర్వాత ఉత్తరాదిన పునఃప్రారంభం అయిన థియేటర్లకు కొత్త కంటెంట్ పెద్దగా అందుబాటులో లేక సూర్య ది సోల్జర్ సినిమాను రిలీజ్ చేశారు.
ముందు నామమాత్రంగానే రిలీజ్ చేశారు కానీ.. థియేటర్లలో ఈ సినిమాకు మంచి రెస్పాన్సే వచ్చింది. 50 పర్సంట్ ఆక్యుపెన్సీలోనే కలెక్షన్లు చెప్పుకోదగ్గ స్థాయిలోనే వచ్చాయి. దీంతో స్క్రీన్లు పెంచారు. మరిన్ని నగరాల్లో, పట్టణాల్లో దీన్ని రిలీజ్ చేశారు. కొత్తగా రిలీజైన సినిమాలతో పోలిస్తే బన్నీ సినిమాకే అక్కడ కలెక్షన్లు ఎక్కువగా వస్తున్నట్లు ట్రేడ్ పండిట్లు ట్వీట్లు వేస్తున్నారు. కలెక్షన్ల వివరాలు కూడా వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా బీహార్ లాంటి మాస్ ప్రేక్షకులు ఎక్కువున్న రాష్ట్రాల్లో ఈ సినిమాకు మంచి స్పందన వస్తోందట. అక్కడ సూర్య ది సోల్జర్ థియేటర్ల ముందు భారీ పోస్టర్లు, జనాల గుంపులకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. బన్నీ డిజాస్టర్ మూవీకి ఉత్తరాదిన ఇప్పుడిలాంటి స్పందన రావడం ఆశ్చర్యమే.
This post was last modified on December 3, 2020 8:11 am
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…