అతివృష్టి లేదా అనావృష్టి అనే సామెత ఒకేసారి మీదపడే థియేటర్ రిలీజులకే కాదు ఓటిటిలకు కూడా వర్తిస్తుంది. కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు పోటీ పడి మరీ శుక్రవారమే వస్తుండటంతో ఏది చూడాలో తెలియని అయోమయంలో ప్రేక్షకులు పడిపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడీ వారం ఇవి పూర్తి చేయకపోతే నెక్స్ట్ ఫ్రైడే వేరేవి వచ్చేస్తాయి. వాటికి విడిగా టైం కేటాయించాలి. ఈసారి మాత్రం ఏదో భోరున వర్షం కురిసినట్టు ఓటిటి కంటెంట్ లు ఆడియన్స్ ని పలకరిస్తున్నాయి. సిద్ధూ జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ డిజాస్టరే కానీ బిగ్ స్క్రీన్ మీద చూడని ఆడియన్స్ భారీ ఎత్తున ఉన్నారు. వాళ్ళందరూ నెట్ ఫ్లిక్స్ లో షో వేసుకోవచ్చు.
ప్రదీప్ రంగనాధన్ ‘డ్యూడ్’ ఇదే ప్లాట్ ఫార్మ్ మీద వచ్చేసింది. తెలుగులో ఓ మోస్తరుగా ఆడిన ఈ న్యూ ఏజ్ లవ్ ఎంటర్ టైనర్ తెలుసు కదాతో పాటు అన్ని భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. కిరణ్ అబ్బవరం లేటెస్ట్ హిట్ ‘కె ర్యాంప్’ అఫీషియల్ డేట్ నవంబర్ 15 అయినా ప్రీమియర్ మెంబర్స్ కు ఇవాళ సాయంత్రం నుంచే ఆహా ప్లాట్ ఫార్మ్ లో యాక్సెస్ ఇవ్వబోతున్నారు. అక్షయ్ కుమార్ జాలీ ఎల్ఎల్బి 3 స్మార్ట్ స్క్రీన్ పైకి వచ్చేసింది. మొదటి రెండు భాగాల స్థాయిలో ఇది బ్లాక్ బస్టర్ కాలేకపోయింది. నరేష్ ప్రధాన పాత్రలో రవిబాబు తీసిన ‘ఏనుగుతొండం ఘటికాచలం’ ఆల్రెడీ ఈటీవీ విన్ లో ఉంది.
ఇండియాస్ మోస్ట్ సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ లో ఒకటిగా పేరున్న ఢిల్లీ క్రైమ్ మూడో సీజన్ అందుబాటులోకి వచ్చింది. ఈసారి హ్యూమన్ ట్రాఫికింగ్ ని నేపథ్యంగా తీసుకుని మెప్పించేలా తీశారని పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. యాంకర్ ఝాన్సీ ప్రధాన పాత్ర పోషించిన ఈగో ఎల్లుండి నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కు రానుంది. ఇవి కాకుండా మళయాలం నుంచి అవిహితం, ఇన్స్ పెక్షన్ బంగాళా లాంటి కొత్త రిలీజులు మల్టీ లాంగ్వేజెస్ లో వచ్చేశాయి. ఇవన్నీ చూసేందుకు కాస్త తీరిక ఉంటే సరిపోదు. గంటల తరబడి వీలు చేసుకుని మరీ చూస్తే తప్ప అన్ని కవర్ కావు. అయినా ఒకేసారి ఇన్నేసి వస్తే జనాలు కన్ఫ్యూజన్ లో ఏది చూస్తారో.
This post was last modified on November 14, 2025 1:09 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…