ప్రభాస్ అదేపనిగా కొత్త సినిమాలు అనౌన్స్ చేయడం ఫాన్స్ని కూడా కన్‍ఫ్యూజ్ చేస్తోంది. రాధే శ్యామ్ పూర్తి చేయకుండా వేరే సినిమాలు అనౌన్స్ చేయడం, ఫలానా సమయానికి షూటింగ్ మొదలవుతుందని చెప్పడం ఫాన్స్కి కూడా అర్థం కావడం లేదు. అయితే ప్రభాస్ ఇదంతా తన సొంత సంస్థ లాంటి యువి క్రియేషన్స్ కోసం చేస్తున్నాడని, ఆర్థికంగా ఆ సంస్థ ఇబ్బందుల్లో వుండడంతో రాధేశ్యామ్‍ను ముందుకు నడిపించడానికి ప్రభాస్ ఇలా మల్టిపుల్ ప్రాజెక్టులు ఓకే చేసి అడ్వాన్సులు తీసుకుంటున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
రాధే శ్యామ్ చిత్రానికి బిజినెస్ నిలిచిపోవడంతో దానికి కావాల్సిన వనరుల కోసం ప్రభాస్ ఇలా ఇతర ప్రాజెక్టుల ద్వారా వచ్చే ఫండ్స్తో హెల్ప్ చేస్తున్నాడని, అలాగే ఆ సంస్థ మరికొన్ని చిన్న సినిమాలు తీయడానికి చేయూత ఇస్తున్నాడని, ఒక విధంగా ఆ సంస్థలో ప్రభాస్ పెట్టుబడి పెడుతున్నట్టేనని ఇండస్ట్రీలో చెవులు కొరుక్కుంటున్నారు.
యువి సంస్థ నిజంగా అంతలేసి ఆర్థిక ఇబ్బందులలో వుందా లేదా అనేది తెలియదు కానీ ఈ గాసిప్స్ అయితే లాజికల్‍గానే వున్నాయి. ఆల్రెడీ షూటింగ్ మొదలైన సినిమాను పూర్తి చేసే పని మానేసి ప్రభాస్ ఇలా సడన్‍గా ఇన్ని సినిమాలు అనౌన్స్ చేయడం వెనుక ఇంతకంటే లాజిక్ అయితే లేదు మరి.
This post was last modified on December 3, 2020 3:16 am
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్‌లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…
ఓ మూడేళ్ళ క్రితం దాకా టాలీవుడ్ టాప్ ప్లేస్ ఎంజాయ్ చేసిన పూజా హెగ్డేను వరస బ్లాక్ బస్టర్లు ఉక్కిరిబిక్కిరి…
ఇటీవలే చెస్ వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన గుకేష్ దొమ్మరాజు ఎందరో యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఇతని నేపథ్యం గురించి…
ఒక పెద్ద హీరో సినిమా థియేట్రికల్ గా మంచి రన్ లో ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఒరిజినల్ కంటెంట్ యూట్యూబ్…
నాగచైతన్య, దర్శకుడు చందూ మొండేటి కాంబినేషన్ లో రూపొందుతున్న తండేల్ లో కీలక ఘట్టం డిసెంబర్ 22 జరగనుంది. పవిత్ర…