బిగ్‍బాస్ షోలో క్రియేటివ్ టీమ్ ఒకరిద్దరు ఆటగాళ్లకు అనుకూలంగా వుంటుందనేది మొదటి సీజన్‍నుంచీ తెలిసిన విషయమే. పబ్లిక్ ఎవరి వైపు అయితే నిలబడతారో వారిని ఇరుకున పెట్టి, మరింతగా ఓట్లు పడేలా చేస్తుంటారు. అయితే ప్రతి సీజన్లో బిగ్‍బాస్ ఎవరికి ఫేవర్ అనేది తెలిసిపోయేది.
ఈసారి కంటెస్టెంట్లలో ఎవరూ కూడా అంత ప్రభావితం చేయగల క్యాండిడేట్లు లేకపోవడంతో బిగ్‍బాస్ టీమ్ ఎవరికి సహకరిస్తోందనేది అర్థం కావడం లేదు. అమ్మ రాజశేఖర్, మెహబూబ్, మోనల్ లాంటి వాళ్లను షోలో ఎక్కువ కాలం వుంచడానికి ప్రయత్నాలు జరిగినా కానీ అవి కేవలం ఆట పరంగా ఆసక్తి రేకెత్తించడానికి చేసిన ప్రయత్నాలే తప్ప మరొకటి కాదు.
చివరి మూడు వారాలకు చేరిపోయిన ఈ తరుణంలో బిగ్‍బాస్ అందరికీ స్క్రీన్ టైమ్ కేటాయించడం ఆసక్తికరమయింది. అభిజీత్, హారికను టార్గెట్ చేస్తూనే వారికి తగిన స్క్రీన్ టైమ్ ఇస్తున్నారు. అలాగే అరియానా, అవినాష్‍కి కూడా చాలా సమయం పాటు సింపతీ గేమ్ నడిపే అవకాశాన్నిస్తున్నారు. అఖిల్, సోహైల్‍ల కండబలం వల్ల మిగతా వాళ్లు నిలబడలేకపోతున్నారనే సంగతి కూడా రిజిష్టర్ చేస్తున్నారు.
ఇటు, అటు అని లేకుండా అన్ని వైపులా ఆడేస్తున్న బిగ్‍బాస్ టీమ్ టాప్ 5లో ఎవరిని వుంచాలనుకుంటున్నారు, అభిజీత్‍ని ఓడించే ఉద్దేశం వుంటే అందుకు తగినవాడు ఎవరని డిసైడ్ చేసారు? చూస్తోంటే బిగ్‍బాస్ టీమ్ టీఆర్పీ గేమ్ ఆడుతూ అందరు కంటెస్టెంట్ల అభిమానులనూ షోకి అంటిపెట్టుకుని వుండేలా జాగ్రత్త పడుతున్నటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates