టాలీవుడ్ లో ఇప్పుడు మోస్ట్ లక్కీ హీరోయిన్ ఎవరయ్యా అంటే భాగ్యశ్రీ బోర్సే పేరే వినిపిస్తోంది. ఎందుకంటే తొలి రెండు సినిమాలు డిజాస్టర్లు అయినా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అందం, చందం, నటన మూడు ఉండటంతో దర్శకులు ఛాన్సులు ఇస్తున్నారు. ఈమె నటించిన కొత్త మూవీ కాంత ఈ వారమే థియేటర్లలో అడుగు పెడుతోంది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ పీరియాడిక్ డ్రామా కోలీవుడ్ బ్యాక్ డ్రాప్ లో 1950 నేపథ్యంతో సాగుతుంది. నేటివిటీ పరంగా ఇబ్బంది లేకుండా అన్ని బాషల ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడట.
ఇదిలా ఉండగా పలు ఇంటర్వ్యూలలో భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ ఈసారి తనలో రియల్ పెర్ఫార్మర్ ని చూస్తారని నొక్కి చెబుతోంది. అంత ధీమా ఏమిటయ్యా అంటే ఇన్ సైడ్ ఒకటి వినిపిస్తోంది. దాని ప్రకారం కాంత కథ ముఖ్యంగా దుల్కర్ సల్మాన్, సముతిరఖని మధ్య అంతర్యుద్ధం ప్రధానంగా సాగుతుంది. వీళ్ళ మధ్యలో జరిగే క్యాట్ అండ్ మౌస్ గేమ్ లో కీలక మలుపులకు కారణమయ్యే పాత్రలో భాగశ్రీ బోర్సేకు నటన పరంగా చాలా స్కోప్ దొరికిందట. ముఖ్యమైన ట్విస్ట్ ఏంటో ఇక్కడ చెప్పడం భావ్యం కాదు కానీ ఊహించని విధంగా టర్న్ అయ్యే తీరు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేయడం అయితే ఖాయం.
కాంత హిట్ అయితే తమిళంలోనూ అడుగు పెట్టొచ్చు. ఎలాగూ ఈ నెలాఖరున వస్తున్న ఆంధ్రకింగ్ తాలూకా మీద పాజిటివ్ వైబ్స్ చాలా ఉన్నాయి. అది కూడా సక్సెస్ అయితే రామ్ తో పాటు సినిమాలో ఉపేంద్ర కూడా ఉన్నారు కాబట్టి శాండల్ వుడ్ నుంచి ఆఫర్లు తలుపు తట్టొచ్చు. సో ముందైతే కాంత విజయవంతమైతే నవంబర్ నెల తనకు శుభ సూచకంగా మారుతుంది. క్యామియోలతో హిందీలో గతంలో డెబ్యూలు చేసినప్పటికీ అవి తనకు ఆశించినంత పేరు తీసుకురాలేదు. అందుకే సౌత్ మార్కెట్ మీద దృష్టి పెడుతోంది. ఇంత కాన్ఫిడెన్స్ గా ఉందంటే మహానటిలో కీర్తి సురేష్ రేంజ్ లో ఏమైనా ఆశించవచ్చేమో.
This post was last modified on November 12, 2025 10:00 pm
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…