కెజిఎఫ్ తర్వాత శాండల్ వుడ్ స్థాయిని పదింతలు పెంచిన బ్లాక్ బస్టర్ గా కాంతార విజయం కేవలం కన్నడకే పరిమితం కాలేదు. తెలుగు హిందీ భాషల్లోనూ రికార్డులు నమోదు చేసింది. మొదటి భాగం నాలుగు వందల కోట్లు రాబడితే రెండో పార్ట్ రెట్టింపు గ్రాస్ తో ఔరా అనిపించింది. ఈసారి మిక్స్డ్ టాక్ పని చేయలేదు. ఆడియన్స్ ఖచ్చితంగా థియేటర్ ఎక్స్ పీరియన్స్ చేయాలన్న ఉద్దేశంతో టికెట్లు కొనేశారు. దాని ఫలితమే రిలీజై నెల రోజులు దాటి ఇటీవలే ఓటిటిలో వచ్చినా బుక్ మై షోలో ఇంకా ట్రెండ్ అవుతూనే ఉంది. వీకెండ్ వస్తే కర్ణాటకలో ఇప్పటికీ మెయిన్ సెంటర్స్ లో టికెట్లు దొరకడం కష్టంగా ఉంది.
దీని స్ఫూర్తిగా తీసుకుని కొందరు దర్శకులు ఏకంగా తమ స్క్రిప్ట్ లు మార్చుకునే పనిలో పడ్డారు. సూర్య హీరోగా ఆర్జె బాలాజీ దర్శకత్వంలో రూపొందుతున్న కరుప్పు చివరి స్టేజికి చేరుకుంది. ముందు అనుకున్న క్లైమాక్స్ కు కొన్ని కీలకమైన మార్పులు చేసి కాంతార స్ఫూర్తితో పూనకాలు వచ్చే రేంజ్ లో ఒక ఎపిసోడ్ డిజైన్ చేశారు. చెన్నై టాక్ ప్రకారం ఇందులో సూర్య శరవణన్ అనే లాయర్ గా పేదల కోసం పోరాడుతూ ఉంటాడు. చివరి ఘట్టంలో తమిళనాట గ్రామ దేవుడైన కరుప్పుస్వామి సూర్య ఒంట్లోకి వచ్చి వీర తాండవం
చేసి విలన్ల భరతం పడతాడు. ఇది చాలా హై వోల్టేజ్ లో ఉంటుందట.
దీన్ని ప్రత్యేకంగా నవంబర్ 15 నుంచి షూట్ చేయబోతున్నట్టు తెలిసింది. ఈ గెటప్ కు సంబంధించిన ఫోటో షూట్ కూడా ఇటీవలే చేశారట. కరుప్పు విడుదల తేదీ ఇంకా ఫైనల్ కాలేదు. సంక్రాంతికి అనుకున్నారు కానీ విపరీతమైన పోటీ ఉండటం వల్ల దాని బదులు జనవరి 26 రిపబ్లిక్ డే ఆప్షన్ చూస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఒక కొలిక్కి వచ్చాక రిలీజ్ డేట్ ప్రకటిస్తారు. ఒకవేళ అప్పటికి పనవ్వలేదంటే వేసవికి వెళ్లడం తప్ప మరో ఆప్షన్ ఉండదు. సూర్య మాత్రం అంత లేట్ చేయొద్దని, సమ్మర్ లో వెంకీ అట్లూరి సినిమా ఉంటుంది కాబట్టి జనవరికే లాక్ చేయమని ఆర్జె బాలాజీకి చెప్పాడట. చూడాలి ఏం చేస్తారో.
Gulte Telugu Telugu Political and Movie News Updates