ఇవాళ తెల్లవారగానే బాలీవుడ్ లెజెండరీ నటులు ధర్మేంద్ర కన్ను మూశారనే వార్త మూవీ లవర్స్ ని హతాశులను చేసింది. అనారోగ్యంతో బాధ పడుతున్నప్పటికీ ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ పోరాడుతున్నారనేది వాస్తవం. కానీ కన్ను మూశారని ప్రచారం జరగడం పట్ల కుటుంబ సభ్యులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ధర్మేంద్ర ట్రీట్ మెంట్ కు స్పందిస్తున్నారని, అనవసరంగా పుకార్లను వ్యాప్తం చేయొద్దని భార్య హేమా మాలిని, కుమార్తె ఈషా డియోల్ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. అంటే ధర్మేంద్ర జిందా హై అని తెలియడం అభిమానులను, ఇండస్ట్రీ వర్గాలను సంతోషంలో ముంచెత్తుతోంది.
ధర్మేంద్ర ప్రస్తుత వయసు 89. అయినప్పటికీ తరచుగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉంటారు. మొన్న ఏడాది కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానిలో షబానా ఆజ్మీ మాజీ ప్రియడిగా నటించి ఆశ్చర్యపరిచారు. అప్పుడప్పుడు పార్టీలలో, ఎవరైనా ప్రముఖులు కన్నుమూసినప్పుడు ధర్మేంద్ర రావడం పలు సందర్భాల్లో కనిపించింది. వయసు రిత్యా ఇబ్బందులు ఉన్నప్పటికీ చురుకుగా ఉండే ధర్మేంద్ర పుట్టినరోజు వేడుకలను సైతం ప్రతి సంవత్సరం జరుపుకుంటూనే ఉంటారు. అలాంటిది ఇంత హఠాత్తుగా చేదు వార్త వినాల్సి వస్తుందని పరిశ్రమ వర్గాలు ఊహించలేదు.
ప్రస్తుతం ఈ పుకారు ఎవరు లేవనెత్తారు అనేది తెలియాల్సి ఉంది. నిన్న రాత్రి సల్మాన్ ఖాన్, సన్నీ డియోల్ తదితరులు హాస్పిటల్ కు వచ్చి ధర్మేంద్రను కలుసుకున్నారు. ఇది చూశాక బహుశా ఆయన చివరి శ్వాసకు దగ్గరగా ఉన్నారేమోననే ప్రచారం ఊపందుకుంది. భాషతో సంబంధం లేకుండా షోలేలో వీరుగా ఎప్పటికీ మర్చిపోలేని నటన ప్రదర్శించిన ధర్మేంద్ర 1970 నుంచి 85 వరకు తిరుగులేని యాక్షన్ హీరోగా ఎన్నో బ్లాక్ బస్టర్స్ లో నటించారు. ఆ తర్వాత షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ట్రెండ్ మొదలయ్యాక క్రమంగా హీరోగా చేయడం తగ్గించుకున్నారు. ఏదైతేనేం ఆయన బ్రతికే ఉన్నారన్న వార్త చాలు.
Gulte Telugu Telugu Political and Movie News Updates