‘బాహుబలి’ సినిమాతో దేశాన్ని ఊపేసి.. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆడియన్సుని షేక్ చేశాడు మన దర్శక ధీరుడు రాజమౌళి. ఇప్పుడు ఆయన్నుంచి రాబోతున్న కొత్త సినిమా కోసం ప్రపంచమే ఎదురు చూస్తోంది. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ మహేష్ బాబుతో రాజమౌళి తీసిన ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో టైటిల్ గ్లింప్స్‌తో పలకరించబోతోంది.
ఈ నెల 15న రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించనున్న భారీ వేడుకలో ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నారు. అందుకోసం ఏర్పాట్లు భారీగానే జరుగుతున్నాయి. ఈ సినిమాకు ‘వారణాసి’ అనే టైటిల్ పెట్టబోతున్నట్లు కొన్ని రోజుల ముందు జోరుగా ప్రచారం జరిగింది. అదే పేరుతో ఒక చిన్న సినిమాను ఈ మధ్యే అనౌన్స్ చేయడంతో వాళ్ల నుంచి ఈ టైటిల్ తీసుకుంటారా.. లేక రాజమౌళి వేరే టైటిల్ పెట్టాడా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. నిజంగా సినిమాకు ఈ టైటిల్ పెట్టలేదేమో అనే చర్చ కూడా జరిగింది.
కట్ చేస్తే ఇప్పుడు రాజమౌళి-మహేష్ మూవీకి కొత్త టైటిల్ తెరపైకి వచ్చింది. మొన్న పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్‌తో సడెన్ సర్ప్రైజ్ ఇచ్చిన జక్కన్న.. ఇప్పుడు సినిమా నుంచి తొలి పాటను వదిలి షాకిచ్చాడు. శ్రుతి హాసన్ ఈ పాటను పాడడం విశేషం. శ్రుతి సింగింగ్, లిరిక్స్, లిరికల్ వీడియో అన్నీ కూడా ఓ రేంజిలో ఉండడంతో ఈ పాటకు మంచి స్పందనే వస్తోంది. కాగా ఈ పాట చూశాక సినిమాకు ‘సంచారి’ అనే టైటిల్ ఖరారు చేసే అవకాశముందా అనే చర్చ మొదలైంది.
ఈ సినిమాను మొదట్నుంచి ‘గ్లోబ్ ట్రోటర్’ పేరుతో సంబోధిస్తున్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా తిరిగే వ్యక్తి అని అర్థం. సినిమాలో హీరో పాత్ర కూడా దేశవిదేశాల్లో తిరుగుతుందని.. ఈ క్రమంలోనే ఆఫ్రికాకు కూడా వెళ్తుందని అంటున్నారు. అందుకే ఈ సినిమాకు ‘సంచారి’ అనే టైటిల్ పెడితే యాప్ట్‌గా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘సంచారి.. సంహారి’ అంటూ సాగిన పాట చూశాక.. టైటిల్ గురించి పరోక్షంగా జక్కన్న హింట్ ఇచ్చాడా అనే చర్చ జరుగుతోంది. మరి వచ్చే శనివారం రివీల్ కాబోయే టైటిల్ ఏదో?
This post was last modified on November 11, 2025 8:06 am
ట్రాఫిక్ చలాన్ వచ్చిందంటే వెంటనే కట్టేవాళ్లు కొందరైతే.. నెలలు, ఏళ్లుగా పెండింగ్‌లో పెట్టేవాళ్లు కూడా ఉన్నారు. ఇలా దేశవ్యాప్తంగా వసూలు…
ప్రస్తుతం ఇండియాలో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే ఎక్కువమంది చెప్పే పేరు.. అనిరుధ్ రవిచందర్‌దే. పేరుకు తమిళ…
రాష్ట్రంలో మంగళగిరి నియోజకవర్గం అత్యంత కీలకంగా మారింది. తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రసిడెంట్, విద్యా శాఖ మంత్రి నారా…
ఇంకో రెండు వారాల్లో దసరా పండగ రానుంది. సెలవుల సీజన్ కావడంతో పిల్లా పెద్ద అందరూ ఎదురు చూస్తున్నారు. బయ్యర్…
మొన్నటిదాకా ఇండస్ట్రీలో ఒకటే గుసగుస. ఏఐ వచ్చేసిందిగా, ఇకపై గ్రాఫిక్స్ కోసం కోట్లు తగలేయాల్సిన పనేముంది అని చాలామంది లెక్కలేసుకున్నారు.…
దర్శకుడు పూరి జగన్నాథ్ కొత్త సినిమా 'స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్' విడుదల వ్యవహారం ఇంకా తేలలేదు. నిన్న…