స్టార్ హీరోల వారసులు హీరోలు కావడమే ఎక్కువసార్లు చూశాం. కానీ వాళ్ళు దర్శకులు కావడం అరుదు. అందులోనూ చిన్న వయసులో అంటే ఊహించలేం. బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ఇటీవలే బ్యాడ్స్ అఫ్ బాలీవుడ్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. యునానిమస్ బ్లాక్ బస్టర్ కాదు కానీ విమర్శల కన్నా ఎక్కువ ప్రశంసలే వచ్చాయి కాబట్టి కుర్రాడు పాస్ కిందే లెక్క. ఇంకొంచెం మెచ్యూరిటీతో రైటింగ్ మీద ఫోకస్ పెడితే టెక్నికల్ గా మరిన్ని అద్భుతాలు చేయొచ్చు. త్వరలో తండ్రినే డైరెక్ట్ చేయొచ్చనే ప్రచారం నార్త్ వర్గాల్లో జరుగుతోంది కానీ ఇప్పటికైతే ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.
ఇప్పుడు తర్వాతి వంతు కోలీవుడ్ స్టార్ విజయ్ కొడుకు జేసన్ సంజయ్ ది. సందీప్ కిషన్ హీరోగా తన దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు సిగ్మా టైటిల్ ని ప్రకటించారు. ఫస్ట్ లుక్ కూడా వదిలారు. పోస్టర్ చూస్తుంటే క్రైమ్ అండ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ అనే క్లారిటీ వస్తోంది. నిజానికి జేసన్ సంజయ్ ని హీరోగా పరిచయం చేస్తామని ఎందరో నిర్మాతలు విజయ్ ని అడిగారు. కానీ కొడుకు వ్యక్తిగత ఆసక్తి డైరెక్షన్ మీదే ఉండటంతో ముందా ముచ్చట తీర్చుకోమని చెప్పి సిగ్మాకు దారి చూపాడు. లైకా ప్రొడక్షన్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ వచ్చిందంటే దానికి ప్రధాన కారణం ఇదే. తర్వాత సంజయ్ టాలెంట్.
సిగ్మాతో జేసన్ సంజయ్ కనక ఋజువు చేసుకుంటే తనకో అరుదైన ఘనత చేకూరుతుంది. అన్నట్టు పవన్ కళ్యాణ్ అబ్బాయి అకీరానందన్ కూడా నటన కంటే ఎక్కువ సంగీతం మీద మక్కువ చూపిస్తున్నాడు. మరి ఏ రూపంలో ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో తెలియదు కానీ ఫ్యాన్స్ అయితే హీరోగానే చూడాలని కోరుకుంటున్నారు. ఆర్యన్ ఖాన్, జేసన్ సంజయ్ లు స్టార్ కిడ్స్ కి ఒక కొత్త దారి చూపించినట్టు అయ్యింది. బలవంతంగా హీరో అయిపోయి ఫాన్స్ అండతో జనాల మీద రుద్దబడటం కంటే ఇలా ఇష్టమైన క్రాఫ్ట్ లో సత్తా చూపించుకోవడం మంచిదే. అన్నట్టు రవితేజ కొడుకు మహాధన్ కూడా స్పిరిట్ కు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తాడట.
This post was last modified on November 10, 2025 11:10 am
బంగారం అంటే భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సురక్షితమైన పెట్టుబడి. అయితే ఈ పసిడి ధరలు ఎందుకు…
ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ప్రతి చిత్ర బృందం కోరుకుంటుంది. ఆ దిశగా విన్నపాలు చేస్తుంది. కానీ తీరా…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో విడుదలైన…
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురించి ప్రపంచ దేశాలకు పరిచయం అక్కర్లేదు. మహిళలపై నోరుపారేసుకునే నేతగా, స్త్రీలోలుడిగా ట్రంప్ నకు చెడ్డపేరుంది.…
గత ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ మిడ్ రేంజ్ మూవీ.. ఎవ్వరూ…
2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. పార్టీ బలాబలాలు,…