పెద్ది ఫస్ట్ ఆడియో సింగల్ చికిరి చికిరి చార్ట్ బస్టర్ అయ్యాక ఇప్పుడు నాని అభిమానుల దృష్టి అనిరుధ్ రవిచందర్ మీదకు వెళ్తోంది. ఎందుకంటే పెద్ది రిలీజైన కేవలం ఒక్క రోజు ముందు ది ప్యారడైజ్ వస్తుంది కాబట్టి. ఖచ్చితంగా క్లాష్ ఉంటుందా లేదానేది ఇప్పుడే చెప్పలేం కానీ రెండు టీమ్స్ ఎప్పటికప్పుడు తమ డేట్లను పోస్టర్లలో ప్రమోషన్లలో నొక్కి వక్కాణిస్తూనే ఉన్నాయి. సో ఇప్పటికైతే పోటీ ఆన్ లో ఉన్నట్టే. రెహమాన్ తన మీద అనుమానాలు పటాపంచలు చేస్తూ బెస్ట్ ట్యూన్ తో ఫ్యాన్స్ హ్యాపీ అయ్యేలా చేశాడు. ఇప్పుడు అనిరుధ్ వంతు వచ్చింది. కానీ ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం అనిరుద్ ఇంకా ప్యారడైజ్ పాటలు ఇవ్వలేదు. శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం టాకీ పార్ట్ మీద ఫోకస్ చేయడంతో వచ్చే నెల అందరికీ అనుకూలమైన టైం చూసి మ్యూజిక్ సిట్టింగ్స్ వేద్దామని ప్లాన్ చేసుకున్నారట. అనిరుధ్ చేతి నిండా సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, జన నాయకుడు బృందాలు రీ రికార్డింగ్ కోసం ఒత్తిడి పెడుతున్నాయి. విడుదల తేదీలు దగ్గరగా ఉండటంతో ఆ ప్రెజర్ చాలా ఉంది. మరి మధ్యలో ప్యారడైజ్ కు ఎంత టైం కేటాయిస్తారు, ఇచ్చినా అందులో ఎంత క్వాలిటీ రాబట్టుకుంటారనేది కీలకం కానుంది. మరో ముఖ్యమైన పాయింట్ ఉంది.
సరే పాటలు ఏదోలా చేయించుకున్నా వాటిని షూట్ చేయాలి. చేతిలో ఉన్న నూటా నలభై రోజుల్లో షూట్ తో పాటు రీ రికార్డింగ్ అయిపోవాలి. ఇదంతా శ్రీకాంత్ ఓదెల, నానిలకు పెద్ద సవాలే. పెద్ది కూడా నలభై శాతం పెండింగ్ ఉంది కానీ రెహమాన్ తో ముందే సాంగ్స్ చేయించుకున్న బుచ్చిబాబు అందుకే టెన్షన్ లేకుండా ఉన్నాడు. ఫిబ్రవరి లో ఒక స్లాట్ ని బీజీఎమ్ కోసం ఆల్రెడీ రెహమాన్ దగ్గర లాక్ చేసుకున్నాడట. సో అనిరుధ్ ఇప్పుడు తన వింటేజ్ మ్యూజిక్ ని బయటికి తీయాలి. పెద్దికి సరైన కాంపిటీషన్ తగిలిందిరా అనిపించేలా అదరగొట్టాలి. న్యాచురల్ స్టార్ ఫ్యాన్స్ దాని కోసమే వెయిట్ చేస్తున్నారు మరి.
This post was last modified on November 8, 2025 9:23 pm
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…