చాలా ఏళ్లుగా తన స్థాయికి తగ్గ సక్సెస్ లేక ఇబ్బంది పడుతూ వచ్చాడు తమిళ టాప్ స్టార్లలో ఒకడైన అజిత్ కుమార్. ఐతే ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఆయన కరవును తీర్చింది. ఇదేం గొప్ప సినిమా కాదు కానీ.. పవన్ కళ్యాణ్ మూవీ ‘ఓజీ’ లాగే నాన్ స్టాప్ ఎలివేషన్లు, ఫ్యాన్ మూమెంట్స్‌తో అజిత్ అభిమానులను అలరించింది. బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రానికి మంచి ఫలితమే వచ్చింది.
ఈ సినిమాలో తనను ప్రెజెంట్ చేసిన తీరు.. తన అభిమానులను అలరించిన వైనం నచ్చి దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్‌కు ఇంకో ఛాన్స్ ఇచ్చాడు అజిత్. అతను కూడా అజిత్‌కు వీరాభిమాని కావడం గమనార్హం. వీరి కలయికలో మరో భారీ చిత్రం తెరకెక్కబోతోంది. ఆ సినిమాలో కీలక పాత్రలకు ఆధిక్ ఎంచుకున్న కాస్టింగ్ అమితాసక్తిని రేకెత్తిస్తోంది.
విలక్షణ నటుడు విజయ్ సేతుపతితో పాటు నటుడిగా, కొరియోగ్రాఫర్‌గా, దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన రాఘవ లారెన్స్ ఈ చిత్రంలో నటిస్తున్నాడట. సేతుపతి చేసే హీరో పాత్రల కంటే అతను నెగెటివ్, క్యారెక్టర్లు భలే కిక్కిస్తాయి. ఇంతకుముందు విజయ్ మూవీ ‘మాస్టర్’లో విలన్ పాత్రతో అతను అదరగొట్టాడు. ఇప్పుడు అజిత్ సినిమాలో అతను నటిస్తున్నాడనగానే క్యూరియాసిటీ పెరుగుతోంది.
అదే సమయంలో లారెన్స్ ఇందులో నటించనున్నాడన్న వార్త కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. అతనిలా వేరే హీరోల చిత్రాల్లో నటించడం అరుదు. ప్రస్తుతం స్వీయ దర్శకత్వంలో ‘కాంచన-4’ నటిస్తున్న లారెన్స్.. అజిత్‌తో నటించడానికి ఒప్పుకోవడం ఇంట్రెస్టింగే. ఈ కాస్టింగ్‌తో సినిమా మీద అంచనాలను భారీగా పెంచేస్తున్నాడు ఆధిక్. ఈ నెలలోనే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లనుంది. వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
This post was last modified on November 7, 2025 3:25 pm
ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ప్రతి చిత్ర బృందం కోరుకుంటుంది. ఆ దిశగా విన్నపాలు చేస్తుంది. కానీ తీరా…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో విడుదలైన…
గత ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ మిడ్ రేంజ్ మూవీ.. ఎవ్వరూ…
2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. పార్టీ బలాబలాలు,…
తన పాత పాటలు ఏవైనా కొత్త సినిమాల్లో వాడుకుంటే అస్సలు ఊరుకోవట్లేదు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా. నోటీసులు ఇస్తున్నారు.…
జాతీయ సినీ అవార్డులు ప్రకటించినపుడల్లా.. ఫలానా సినిమాకు అన్యాయం జరిగింది, ఫలానా ఆర్టిస్టుకు అవార్డు ఇవ్వాల్సింది అనే చర్చ జరగడం…