రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత ఫిజికల్ ఫిట్‍నెస్‍పై శ్రద్ధ తగ్గించేసిన పవన్ కళ్యాణ్ లాక్ డౌన్ టైమ్‍లో కూడా దానిపై దృష్టి పెట్టినట్టు లేడు. ‘వకీల్ సాబ్’ చిత్రం షూటింగ్‍ని అదే అవతారంలో తిరిగి మొదలు పెట్టేసాడు.
అయితే ఈ చిత్రంలో ఫ్లాష్‍బ్యాక్ ఎపిసోడ్ కోసం పవన్ ఏజ్ తగ్గి కనిపించాల్సిన అవసరం వుంది. అందుకోసం పవన్ ప్రస్తుతం లిక్విడ్ డైట్ మీద వున్నాడట. గతంలో జానీ చిత్రంలో లీన్ లుక్ కోసం పవన్ ఏడాదిన్నర పాటు కేవలం పానీయాలు మాత్రమే తీసుకునేవాడు. ఎలాగో షూటింగ్‍కి బ్రేక్ వచ్చింది కనుక ఇప్పుడు మేక్ ఓవర్ మీద దృష్టి సారించాడు. ని
హారిక పెళ్లితో పాటు ఇతర రాజకీయ పరమైన మీటింగులన్నీ ముగించుకుని సరికొత్త రూపంలో వకీల్ సాబ్ షూటింగ్ ఫినిష్ చేస్తాడట. ఆ తర్వాత అదే లుక్‍తో ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రానికి సంబంధించిన ఫ్లాష్‍బ్యాక్ వర్క్ ముందుగా మొదలు పెట్టి ఆ తర్వాత మిగతా సినిమా చేస్తాడట.
ఈ రెండు సినిమాలు ఎప్పుడయినా విడుదల కానీ… పవన్ మాత్రం ఏప్రిల్ లోగా రెండు సినిమాల షూటింగులు పూర్తి చేసేసి తదుపరి సినిమాలపై దృష్టి పెడతాడట. 2022 సంక్రాంతి లోగా పవన్ నటించిన మూడు సినిమాలు విడుదలవుతాయనేది ఇండస్ట్రీ అంచనా.
This post was last modified on December 1, 2020 5:00 pm
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…