ఎస్ఎస్ఎంబి 29 ఈవెంట్ ఇంకో ఎనిమిది రోజుల్లో జరగనున్న నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి తనదైన మార్కెటింగ్ కి తెరతీశారు. ఒకపక్క ఎస్ఎస్ కార్తికేయ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు ఉత్సాహం కలిగేలా అప్డేట్స్ ఇస్తుండగా తాజాగా జక్కన్న వేసిన ట్వీట్ ఫ్యాన్స్ కి ఎక్కడ లేని జోష్ ఇచ్చింది. ప్రస్తుతం క్లైమాక్స్ షూట్ చేస్తున్నామని, త్వరలో జరగబోయే గ్లోబ్ ట్రాట్టర్ వేడుక కోసం తాము కూడా ఎదురు చూస్తున్నామని, గతంలో ఎన్నడూ చేయని విధంగా వచ్చే వారం రోజులు మీకు ఎనర్జీ ఇచ్చేలా కొత్త కబుర్లు వస్తాయని, అందులో భాగంగా పృథ్విరాజ్ సుకుమారన్ లుక్ ఈరోజు రిలీజ్ చేస్తామని చెప్పేశారు
ఈ లెక్కన రాజమౌళి చాలా వేగంగా ఈ ప్యాన్ వరల్డ్ మూవీని తెరకెక్కిస్తున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే బాహుబలికి అయిదేళ్లకు పైగా, ఆర్ఆర్ఆర్ కు నాలుగు సంవత్సరాల దాకా టైం పట్టింది. కానీ ఎస్ఎస్ఎంబి 29 రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లి ఇంకా ఏడాది కాలేదు. కానీ కీలక భాగం పూర్తి చేయడం విశేషం. ఇప్పుడేదో క్లైమాక్స్ తీస్తున్నారు కాబట్టి ఇదేమి లాస్ట్ షెడ్యూల్ కాదు. ఇంకా బోలెడు పెండింగ్ ఉంది. కాకపోతే ఆర్టిస్టుల డేట్లు, ఫారిన్ షెడ్యూల్స్ దృష్టిలో పెట్టుకుని దానికి అనుగుణంగా ముందు చివరి ఘట్టాన్ని కానిస్తున్నారు. అయితే ఈ సినిమా ఒక భాగమా రెండు భాగాల అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న మరో సస్పెన్స్ టైటిల్. వారణాసి అని ఒకరు రుద్ర అని మరొకరు ఇలా రకరకాల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. రాజమౌళి ఏది ఫైనల్ చేశారనేది చివరి నిమిషం వరకు రివీల్ అవుతుందో లేదో తెలియదు. గ్లొబ్ ట్రాట్టర్ ఈవెంట్ కోసం రామోజీ ఫిలిం సిటీలో ఏర్పాట్లు ప్రారంభం కాబోతున్నాయి. ప్రస్తుతం ఏఆర్ రెహమాన్ లైవ్ కన్సర్ట్ కోసం చేస్తున్న వర్క్ ని చూసి ఇది మహేష్ మూవీ కోసమేనంటూ ట్విట్టర్ లో కొందరు హడావిడి చేశారు కానీ అది నిజం కాదు. క్యాస్టింగ్ కు సంబంధించి చాలా విషయాలు గుట్టుగా ఉంచుతున్న రాజమౌళి ఇంకేమేం సర్ప్రైజులు ఇస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates