‘భలే భలే మగాడివోయ్’ చూడ్డానికి మామూలు సినిమాగానే కనిపిస్తుంది కానీ.. బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద సంచలనం. ఆ సినిమా చేసే సమయానికి నాని ఐదు కోట్ల మార్కెట్ ఉన్న హీరో. మారుతి కూడా అప్పటి దాకా చిన్న సినిమాలే చేశాడు. అలాంటి కాంబినేషన్లో వచ్చిన సినిమా రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టి ట్రేడ్ పండితుల్ని ఆశ్చర్యానికి గురి చేసింది.
ఈ సినిమా తర్వాత నాని, మారుతిల రేంజే మారిపోయింది. ఈ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్లో ఇంకో సినిమా కోసం ఎప్పట్నుంచో ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. కానీ ఇదిగో అదిగో అన్నట్లే ఉంది కానీ.. కాంబినేషన్ సెట్ కావట్లేదు. ఐతే ఎట్టకేలకు రవితేజ పుణ్యమా అని ఈ కలయిక కుదిరినట్లు తెలుస్తోంది. అదేంటి నాని, మారుతి సినిమా.. రవితేజ వల్ల సెట్ అవడమేంటి అనిపిస్తోంది కదా. ఇదే ట్విస్టు.
గత ఏఢాది ‘ప్రతి రోజూ పండగే’తో సూపర్ హిట్ కొట్టిన మారుతి.. దీని తర్వాత రవితేజతో సినిమా చేయాలనుకున్నాడు. యువి క్రియేషన్స్ బేనర్లో ఈ సినిమా సెట్ అయినట్లే కనిపించింది. కానీ ఏం జరిగిందో ఏమో.. ఈ సినిమా పట్టాలెక్కట్లేదని అంటున్నారు. రవితేజ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లే అన్నది తాజా సమాచారం. ఐతే మాస్ రాజా కోసం మాంచి ఎంటర్టైనింగ్ సబ్జెక్టు రెడీ చేసిన మారుతి.. ఆయన స్థానంలో ఏ హీరోను తీసుకుందామా అని చూసి నాని దగ్గర ఆగాడట.
వేరే కమిట్మెంట్ల వల్ల ఇంతకుముందు మారుతితో చేయలేకపోయాడు కానీ.. అతడితో పని చేయడానికి నాని ఎప్పుడూ రెడీనే. ఇప్పుడు కూడా ఒకటికి మూడు సినిమాలు లైన్లో పెట్టాడు కానీ.. కొంచెం వీలు చూసుకుని ముందో వెనుకో మారుతితో సినిమా చేయడానికి నాని ఓకే అన్నట్లు సమాచారం. కుదిరితే మధ్యలో మారుతి వేరే సినిమా చేసి అయినా.. ఇప్పటికే రెడీగా ఉన్న స్క్రిప్టును నానీతోనే చేయాలని మారుతి ఫిక్సయ్యాడట. అలా ఆ రకంగా రవితేజ వల్ల ఈ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్ సెట్టయిందన్నమాట.
This post was last modified on December 1, 2020 3:32 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…