ఈ శుక్రవారం తెలుగులో మూడు సినిమాలు బాక్సాఫీస్ పోరుకు రెడీ అయ్యాయి. అందులో ఎక్కువ మంది దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం.. రష్మిక మందన్నా లీడ్ రోల్ చేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’. ఈ సినిమా గురించి విడుదలకు ముందే ఇండస్ట్రీలో గొప్పగా మాట్లాడుకుంటున్నారు. మరోవైపు మంచి సినిమాలే చేస్తున్నా కోరుకున్న విజయం దక్కని సుధీర్ బాబు.. ఈసారి ట్రెండుకు తగ్గట్లుగా డివైన్ టచ్ ఉన్న హార్రర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆ చిత్రమే.. జటాధర. తిరువీర్ హీరోగా నటించిన ‘ది గ్రేట్ ప్రి వెడ్డింగ్ షో’ కూడా పెయిడ్ ప్రివ్యూలతో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
ఐతే ప్రస్తుతానికి ప్రధాన పోటీ రష్మిక, సుధీర్ చిత్రాల మధ్య ఉంది. వీటికి తోడుగా తమిళ అనువాదం ‘ఆర్యన్’ కూడా రిలీజవుతోంది. విశేషం ఏంటంటే.. రేపు బాక్సాఫీస్ దగ్గర ఢీకొట్టబోతున్న హీరో సుధీర్ బాబు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్.. ఆ తర్వాత కలిసి పని చేయబోతున్నారు. సుధీర్ బాబు తన కొత్త చిత్రాన్ని రాహుల్ దర్శకత్వంలోనే చేయబోతున్నట్లు వెల్లడించాడు. ‘చి ల సౌ’తో అందరినీ ఆశ్చర్యపరిచి.. ‘మన్మథుడు-2’తో షాక్ తిన్న రాహుల్.. ‘ది గర్ల్ ఫ్రెండ్’తో బౌన్స్ బ్యాక్ అయ్యేలానే కనిపిస్తున్నాడు.
దీని తర్వాత అతను సుధీర్ బాబుతో ఒక సెన్సేషనల్ మూవీ చేయనున్నాడట. అలాంటి కథ ఇప్పటిదాకా ప్రపంచంలో ఎక్కడా రాలేదని ఎలివేషన్ ఇస్తున్నాడు సుధీర్ బాబు. అదొక బాహుబలి తరహా సినిమా అని కూడా అతను చెప్పడం విశేషం. సుధీర్ అంతగా చెబుతుండడంతో ఏంటా కాన్సెప్ట్ అనే ఆసక్తి కలుగుతోంది. దీంతో పాటు ఎప్పట్నుంచో వాయిదా పడుతూ వస్తున్న పుల్లెల గోపీచంద్ బయోపిక్‌లోనూ తాను నటించాల్సి ఉందని సుధీర్ తెలిపాడు. ‘భాగి’లో విలన్ రోల్ చేశాక హిందీ నుంచి చాలా ఛాన్సులు వచ్చినా తాను నటించలేదని.. ‘జటాధర’తో హిందీ ప్రేక్షకులను కూడా ఆకట్టకుంటాననే నమ్మకం ఉందని సుధీర్ బాబు తెలిపాడు.
This post was last modified on November 6, 2025 8:20 pm
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…