Movie News

మల్టీప్లెక్సులకు కండిషన్లు పెట్టిన నిర్మాతలు

కరోనా-ధాటికి సినీ పరిశ్రమ మామూలుగా దెబ్బ తినలేదు. నిర్మాతలు అన్ని రకాలుగా నష్టం చవిచూశారు. ఐతే అదే సమయంలో సినిమాను నమ్ముకున్న థియేటర్ల వ్యవస్థ మరింతగా దెబ్బ తింది. నిర్మాతలైనా ఓటీటీల్లో సినిమాలను రిలీజ్ చేసో.. షూటింగ్‌ ఖర్చులు తగ్గించుకునో నష్టాలు కొంత మేర పూడ్చుకునే ప్రయత్నం చేశారు. కానీ థియేటర్ల వ్యవస్థకు ఆ అవకాశం కూడా లేకపోయింది. ఎనిమిది నెలలుగా వాటిని నమ్ముకున్న వాళ్లకు పైసా ఆదాయం లేదు. ఎ

ట్టకేలకు తెలంగాణలో థియేటర్లు తెరుచుకోవడానికి అనుమతి రాగా.. డిసెంబరు 4 నుంచి వాటిని నడపడానికి సన్నాహాలు చేస్తున్నారు. సింగిల్ స్క్రీన్ల సంగతేమో కానీ.. మల్టీప్లెక్సులైతే ఆ రోజున మొదలైపోతున్నాయి. ఐతే ఉత్సాహంగా స్క్రీన్లు తెరవడానికి రెడీ అవుతున్న మల్టీప్లెక్సులకు టాలీవుడ్ నిర్మాతలు కొన్ని కండిషన్లతో స్వాగతం పలుకుతున్నారు.

మల్టీప్లెక్సుల్లో రెవెన్యూ షేరింగ్ విషయమై ఎప్పట్నుంచో వివాదం నడుస్తోంది. అవి నిర్మాతలను శాసిస్తున్నాయని.. ఆదాయంలో ఎక్కువ వాటా తీసుకుని తమను దెబ్బ తీస్తున్నాయని నిర్మాతలు అంటున్నారు. దీనికి తోడు థియేటర్లతో మరికొన్ని వివాదాలు కూడా ఉన్నాయి. ఐతే ఇప్పుడు మల్టీప్లెక్సులు కొత్త కంటెంట్ కోసం తమ వైపు చూస్తున్న నేపథ్యంలో నిర్మాతలు తమ డిమాండ్లను నెరవేర్చుకోవడానికి ఇదే సరైన సమయంగా భావించారు.

ఈ నేపథ్యంలో రెవెన్యూ షేరింగ్ మార్చాలని వాళ్లు ఒక ప్రతిపాదన పెట్టారు. ఇప్పటిదాకా ఒక సినిమాకు తొలి వారంలో వచ్చే వసూళ్లలో నిర్మాతలకు 55 శాతం, మల్టీప్లెక్సులకు 45 శాతం ఆదాయం దక్కుతోంది. తర్వాతి మూడు వారాల్లో వరుసగా 45:55, 40:60, 35:65 నిష్పత్తిలో నిర్మాతలు, థియేటర్లకు ఆదాయం అందుతోంది.

ఐతే ఇకపై తొలి వారం ఆదాయంలో తమకు 60 శాతం వాటా ఇచ్చి మల్టీప్లెక్సులు 40 శాతం తీసుకోవాలని యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ డిమాండ్. తర్వాతి రెండు వారాల్లో 50:50, 40:60 నిష్పత్తిలో వాటా పంచుకుందామని ప్రతిపాదన పెట్టారు. ఈ రెవెన్యూ షేరింగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకేలా ఉండాలని.. దీంతో పాటు తమ నుంచి వసూలు చేసే వర్చువల్ ప్రింట్ ఫీని రద్దు చేయాలని, థియేటర్లలో వేసే ట్రైలర్లకు డబ్బులు వసూలు చేయొద్దని, మల్టీప్లెక్సుల ఆవరణలో పెట్టే పోస్టర్లు, ఇతర మెటీరియల్స్‌కి డబ్బులు వసూలు చేయకూడదని, ప్రభుత్వం అధిక షోలకు అనుమతిస్తే మల్టీప్లెక్సులు పాటించాలని.. ఇలా కొన్ని డిమాండ్లు పెట్టారు. మరి వీటికి మల్టీప్లెక్సుల యాజమాన్యాలు ఎంతమేర అంగీకరిస్తాయో చూడాలి.

This post was last modified on December 1, 2020 1:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అదానీ-జగన్ లింకుపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…

3 hours ago

ఈవన్నీ చేస్తే AP టూరిజంకు తిరుగుండదు

జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…

5 hours ago

రేవంత్ రెడ్డి.. అదానీ ఒప్పందాలు రద్దు చేస్తారా?

అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…

5 hours ago

మంచు విష్ణు అసలు ప్లానింగ్ ఇదా

మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…

6 hours ago

సాక్షి మీడియా నన్ను కవర్ చేయదు…షర్మిల సెటైర్లు

మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…

7 hours ago