Movie News

నెట్ ఫ్లిక్స్ ఇడ్లీలు భలే తింటున్నారు

ధనుష్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన ఇడ్లి కడై తమిళంలో ఓ మోస్తరుగా ఆడింది కానీ తెలుగులో డిజాస్టర్ మూటగట్టుకుంది. ఎమోషనల్ మూవీ కాబట్టి మన ప్రేక్షకులు ఆదరిస్తారనే అంచనా పూర్తిగా తప్పింది. ఒరిజినల్ వెర్షన్ కు డ్యూడ్ తో పోటీ లేకపోయి ఉంటే ఇంకా బెటర్ గా ఆడేదన్న కామెంట్ లో నిజం లేకపోలేదు. ఇటీవలే నాలుగు వారాల థియేటర్ విండో పూర్తి చేసుకుని ఇడ్లి కొట్టు నెట్ ఫ్లిక్స్ లో వచ్చేసింది. వారం తిరక్కుండానే 5 మిలియన్ల వ్యూస్ దాటేసింది. ఇదే ప్లాట్ ఫామ్ లో ఉన్న ఓజి అయిదు మిలియన్లు చేరుకోవడానికి పదకొండు రోజులు పట్టడం గమనించాల్సిన విషయం.

యాక్షన్ ఎలిమెంట్స్, కమర్షియల్ హంగులు, ఎలివేషన్లు లేని ఒక పల్లెటూరి సినిమాకు ఇంత స్పందన రావడం అనూహ్యం. ఎందుకయ్యా అంటే భారీ శాతం ఆడియన్స్ దీన్ని థియేటర్లలో చూడలేదు. మిస్సయిన వాళ్ళే ఎక్కువ. అందులోనూ కంప్లీట్ ఫ్యామిలీ జానర్ కాబట్టి ఇంట్లో చూసేందుకు ప్రాధాన్యం ఇచ్చినవాళ్లు ఎక్కువ. దీంతో సహజంగానే వ్యూస్ ఎక్కువగా వచ్చాయి. ఆశ్చర్యం కలిగించే మరో విషయం ఏంటంటే అయిదు దేశాల్లో ఇడ్లి కొట్టు నెంబర్ వన్ స్థానంలో ఉండగా నాన్ ఇంగ్లీష్ మూవీస్ లో ప్రపంచవ్యాప్తంగా రెండో స్థానంలో ఉంది. పదిహేను దేశాల్లో టాప్ టెన్ లో చోటు దక్కించుకుంది.

ఇదంతా చిన్న ఘనత కాదు. ధనుష్ మార్కెట్ పరంగా ఇది చాలా ఉపయోగపడుతుంది. నిర్మాణంలో ఉన్న సినిమాలకు భారీ డిజిటల్ రేట్ పలుకుతుంది. అందులోనూ ఓజిని డామినేట్ చేసే స్థాయి అంటే ఆఫర్లు మరింత పెరుగుతాయి. సెంటిమెంట్ మరీ ఎక్కువైపోయి ల్యాగ్ అనిపించి మన జనాలు ఇడ్లి కొట్టుని వద్దన్నారు కానీ తమిళంలో చెప్పుకోదగ్గ వసూళ్లే వచ్చాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఒకటుంది. స్టార్ ఉంటే ఎంత హోమ్లీ కంటెంట్ అయినా జనాలు ఓటిటిలో చూస్తారని చెప్పడానికి ఇడ్లి కొట్టు ఉదాహరణగా నిలుస్తోంది. ధనుష్ మాత్రం ఈ రిజల్ట్ పట్ల పిచ్చ హ్యాపీగా ఉండుంటాడు.  ఫ్యాన్స్ గురించి చెప్పేదేముంది.

This post was last modified on November 5, 2025 1:26 pm

Share

Recent Posts

మహాకాళి శ్రియ… థియేటర్లలో పూనకాలే!

శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…

7 minutes ago

త్రినాధ్ సంభవాన్ని తక్కువంచనా వేశారా

ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…

10 minutes ago

హోంమంత్రి పై కూలిన డ్రోన్‌… ఏం జ‌రిగింది?

ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్‌.. కొద్ద దూరం పైకి వెళ్లి…

2 hours ago

కుళ్లిపోయిన 100 టన్నుల చికెన్‌… చేపల ఆహారంగా!

కుళ్లిపోయిన చికెన్‌ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో…

3 hours ago

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

3 hours ago

ఆ ముగ్గురి మ‌ర‌ణానికి కార‌ణం ఐఫోన్ కాదా?

మ‌హారాష్ట్ర‌లో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండ‌గా, నిమిషాల వ్య‌వ‌ధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్…

3 hours ago