స్పీచులతో సోషల్ మీడియా సెన్సేషన్ గా నిలిచే నిర్మాత బండ్ల గణేష్ మరోసారి అలాంటి చర్చకు తావిచ్చారు. తాజాగా జరిగిన కె ర్యాంప్ సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ కిరణ్ అబ్బవరంని ఓ రేంజ్ లో పొగిడే క్రమంలో మరో హీరో మీద విపరీతమైన పంచులు వేయడం హాట్ టాపిక్ గా మారింది. కొందరు ఒక హిట్టు రాగానే అర్థరాత్రిళ్ళు కళ్లద్దాలు పెట్టుకుని వాట్సాప్ వాట్సాప్ అంటూ సుకుమార్, రాజమౌళి, అనిల్ రావిపూడి కావాలని డిమాండ్ చేస్తారని, కానీ కిరణ్ అలా కాకుండా ఎన్ని హిట్లు వచ్చినా ఒదిగి ఉండటం చూస్తుంటే ఏకంగా చిరంజీవి గుర్తుకు వస్తున్నారని చాలా పెద్ద పోలికను తెచ్చిపెట్టి ఆకాశంలో నిలబెట్టేశారు.
బండ్ల గణేష్ ఎవరిని ఉద్దేశించి ఆ వాట్సాప్ మాట అన్నారో కానీ ట్విట్టర్ టాక్ మాత్రం విజయ్ దేవరకొండ గురించే అని నిర్ధారించడం అసలు ట్విస్టు. ఎందుకంటే తరచుగా వాట్సాప్ అనే పదం వాడేది తనే కాబట్టి. అయితే గణేష్ అన్నది నిజంగా రౌడీ బాయ్ నా కాదా అనేది పక్కనపెడితే కిరణ్ ని పొగిడే క్రమంలో మరొకరి ప్రస్తావన ఎందుకనే ప్రశ్న ఇక్కడ తలెత్తుతోంది. హిట్లు ఫ్లాపులు అందరికీ వస్తాయి. ఆ మాటకొస్తే కె ర్యాంప్ కన్నా ముందు కిరణ్ అబ్బవరంకు దిల్ రుబా అనే దారుణమైన డిజాస్టర్ ఉంది. ఇవి అందరికీ జరిగేదే. అందుకే విజయ్ ఫ్యాన్స్ కౌంటర్లతో ట్వీట్లు గట్రా బలంగానే వేస్తున్నారు.
ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయం మరొకటి ఉంది. ఇదే బండ్ల గణేష్ ఆ మధ్య లిటిల్ హార్ట్స్ ఈవెంట్ లో మాట్లాడుతూ ఇండస్ట్రీలో పెద్దలు సెలబ్రిటీలు చేసే పొగడ్తలు నమ్మవద్దు, అన్నీ అబద్దాలే అంటూ హీరో మౌళికి హితబోధ చేశారు.ఆ వేడుకకు గెస్టు విజయ్ దేవరకొండనే. మరి ఇప్పుడు అదే వ్యక్తి కిరణ్ ని ఏకంగా మెగాస్టార్ తో పోల్చడం వెనుక మర్మం ఏమిటనే లాజిక్ బయటికి వస్తుంది. కాకపోతే ఇంకో మాట బండ్ల గణేష్ కరెక్ట్ గానే అన్నారు. నిర్మాత రాజేష్ దండాని ఉద్దేశించి మాట్లాడుతూ రాజకీయాల్లో వార్నింగులు పనికి వస్తాయి కానీ సినిమా పరిశ్రమలో కాదని చెప్పారు. ఇది ఒప్పుకోవాల్సిన విషయమే కానీ వాట్సాప్ కామెంట్ మాత్రం వైరలవుతోంది.
This post was last modified on November 3, 2025 11:08 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…