మాస్ రాజా రవితేజ కెరీర్లో ఎంతో ముఖ్యమైన సినిమా.. మాస్ జాతర. గత ఏడాది ఈగల్, మిస్టర్ బచ్చన్ చిత్రాలతో షాక్ తిన్న ఆయన.. కొంచెం గ్యాప్ తీసుకుని ‘మాస్ జాతర’ చేశాడు. ‘సామజవరగమన’తో రైటర్‌గా మంచి పేరు సంపాదించిన భాను భోగవరపు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు.
ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్ మీద ఈ సినిమాను నిర్మించాడు. శుక్రవారం ఫస్ట్ షోల నుంచి ఈ సినిమా ప్రేక్షకులను పలకరిస్తోంది. రేపు పూర్తి స్థాయిలో రిలీజవుతుంది. ‘బాహుబలి: ది ఎపిక్’ రీ రిలీజ్‌తో పోటీ పడుతూ ఈ సినిమా థియేటర్లలోకి దిగింది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ టార్గెట్ ఎంత? ఏమేర కలెక్ట్ చేస్తే సేఫ్ అవుతుంది? అనే ప్రశ్నలు రవితేజ అభిమానుల్లో ఉన్నాయి.
‘మాస్ జాతర’ బాక్సాఫీస్ టార్గెట్ మరీ పెద్దదేమీ కాదు. వరల్డ్ వైడ్ రూ.21 కోట్ల షేర్ సాధించాల్సి ఉంది మాస్ రాజా కొత్త సినిమా. అంటే గ్రాస్ రూ.35 కోట్ల మేర రావాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.14 కోట్ల షేర్ రాబడితే సినిమా సేఫ్ అవుతుంది. మాస్ రాజా బాక్సాఫీస్ స్టామినాకు ఇది పెద్ద టార్గెట్ ఏమీ కాదు. కాకపోతే ఆయన గత చిత్రాల ప్రభావం ఈ సినిమాపై కొంత పడిందన్నది వాస్తవం. అందుకే బిజినెస్ భారీగా జరగలేదు.
సినిమాకు బాగానే ఖర్చయినప్పటికీ.. ఓటీటీ డీల్ ద్వారా మంచి ఆదాయమే రావడంతో నిర్మాత నాగవంశీ ఓ మోస్తరు రేటుకే సినిమాను అమ్మాడు. తాను డిస్ట్రిబ్యూట్ చేసిన వార్-2, ప్రొడ్యూస్ చేసిన ‘కింగ్డమ్’ నిరాశ పరిచిన నేపథ్యంలో నాగవంశీ కాస్త తక్కువ రేట్లకే సినిమాను డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చినట్లు తెలుస్తోంది. సేఫ్ టార్గెట్లే ఉన్నాయి సినిమాకు. కావాల్సిందల్లా పాజిటివ్ టాకే. మాస్ ఈ సినిమాకు కనెక్ట్ అయితే ఈజీగానే పనైపోతుంది.
This post was last modified on October 31, 2025 8:43 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…