వచ్చే వారం వస్తున్న కొత్త సినిమాల్లో కాస్త నోటబుల్ అని చెప్పుకోదగిన వాటిలో ముఖ్యమైంది ది గర్ల్ ఫ్రెండ్. రష్మిక మందన్న టైటిల్ రోల్ పోషించిన ఈ వెరైటీ లవ్ థ్రిల్లర్ కు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. నాగార్జునతో మన్మథుడు 2 లాంటి అవకాశాన్ని వృథా చేసుకున్న తనకు ఇప్పుడీ గర్ల్ ఫ్రెండ్ చాలా ముఖ్యం. ప్రమోషన్ల పరంగా ఏమేం చేయాలో అంత చేస్తున్నారు. ఆ మధ్య చేసిన ట్రైలర్ లాంచ్ జనాల దృష్టిలోకి వెళ్ళింది. ఇంటర్వ్యూ కంటెంట్ ఆడియన్స్ కి మెల్లగా రీచ్ అవుతోంది. అంతా బాగానే ఉంది కానీ కేవలం రష్మిక బ్రాండ్ తోనే దీనికి ఓపెనింగ్స్ వస్తాయన్న గ్యారెంటీ లేదు.
పబ్లిసిటీ పరంగా ఏదో మేజిక్ జరగాలి. త్వరలో నిర్వహించబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విజయ్ దేవరకొండని తీసుకొస్తామని అల్లు అరవింద్ చెప్పినప్పటికీ ఇప్పుడప్పుడే ఈ జంట స్టేజిలో షేర్ చేసుకునే ఉద్దేశంలో లేదని ఇన్ సైడ్ టాక్. ఎంగేజ్ మెంట్ అయినా తమ బంధాన్ని ఇప్పటిదాకా అఫీషియల్ చేయని విజయ్, రష్మికలు సరైన సందర్భం వేదిక కోసం ఎదురు చూస్తున్నారట. అది గర్ల్ ఫ్రెండ్ కి సంబంధించింది అయితే బాగుంటుందనేది నిర్మాతల ఆలోచన. కానీ వీళ్ళు ఎంత వరకు సుముఖ్యంగా ఉంటారనేది చూడాలి. నవంబర్ 7 రిలీజ్ అవుతున్న వాటిలో సాలిడ్ గా చెప్పుకునే కాంపిటీషన్ పెద్దగా లేదు.
ఎన్నో ఆశలు పెట్టుకున్న బాలీవుడ్ మూవీ తమ్మ అంచనాలకు తగ్గట్టు పెర్ఫార్మ్ చేయలేకపోయింది. మాడక్ హారర్ సిరీస్ లో ఇదే వీకెఎస్ట్ మూవీగా విమర్శకులు వర్ణించారు. రష్మిక నటనకు ప్రశంసలు వచ్చినప్పటికీ అసలు కంటెంట్ జనాన్ని మెప్పించలేకపోయింది. ఒక రకంగా చెప్పాలంటే సికందర్ తర్వాత అంత ఫ్లాప్ తమ్మనే అంటున్నారు. యానిమల్, పుష్ప 2, చావాలతో మంచి ఊపు మీదున్న టైంలో ఇలాంటి స్పీడ్ బ్రేకర్లు ఇబ్బంది పెట్టేవే. ఇక యూత్ ని టార్గెట్ చేసుకుంటున్న ది గర్ల్ ఫ్రెండ్ కనక ట్రైలర్ చూపించినట్టు షాకింగ్ ఎలిమెంట్స్ తో కనక ఉంటే శ్రీవల్లి ఖాతాలో సోలో విజయం పడిపోతుంది.
This post was last modified on October 31, 2025 4:59 pm
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు చేయడం తనకు కొత్త కాదని, ఎన్నికల్లో పోటీ చేయడం…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…