ఇంకొద్ది గంటల్లో ప్రారంభం కాబోతున్న మాస్ జాతర ప్రీమియర్ల కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. బాహుబలి ఎపిక్ గొడవలో పడి జనాలు దీని మీద అంత సీరియస్ గా దృష్టి పెట్టకపోవడంతో, బజ్ పరంగా సోషల్ మీడియాలో పెద్దగా హడావిడి లేకపోవడం వాళ్ళను టెన్షన్ పెడుతున్న మాట వాస్తవం. పైగా అఫీషియల్ రిలీజ్ డేట్ అక్టోబర్ 31 అని ప్రకటించి సాయంత్రం నుంచి షోలు పడేలా ప్లాన్ చేయడం కొంత అయోమయానికి దారి తీసింది. రెగ్యులర్ షోలు పడుతున్న నవంబర్ 1ని పరిగణనలోకి తీసుకోవాలా లేక ఇవాళ్టి నుంచి కౌంట్ అవుతుందా అనేది పజిల్ లాంటి ప్రశ్న. సరే సినిమా బాగుంటే ఇదేం పెద్ద విషయం కాదు.
టైటిల్ కు తగ్గట్టు మాస్ జాతర ప్రధానంగా మాస్ జనాలను మెప్పిస్తే చాలు పాసైపోయినట్టే. గతంలో ధమాకా ఇదే తరహాలో సూపర్ హిట్ కొట్టిన సంగతి అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. తర్వాత రవితేజకి సోలోగా ఒక్కటంటే ఒక్క హిట్టు పడలేదు. మాస్ జాతర ఆ లోటుని పూర్తిగా భర్తీ చేయాలి. టీజర్, ట్రైలర్ గట్రా మరీ కొత్తగా ఉందనే ఫీలింగ్ ఇవ్వడంలో అంతగా సక్సెస్ కాకపోవడంతో అసలు కంటెంట్ మీదే అందరి దృష్టి ఉంది. దర్శకుడు భాను భోగవరపుకి రచయితగా ఎంత పేరున్నా డైరెక్షన్ పరంగా ఇదే మొదటిది. సో హీరోకన్నా ఎక్కువగా ఇది సక్సెస్ కావడం తనకే అవసరం. కాకపోతే బజ్ ఇంకా రావాల్సి ఉంది.
ఇక్కడ మరో అంశాన్ని ప్రస్తావించుకోవాలి. ధమాకా లాగా మాస్ జాతరకు భీమ్స్ వైరల్ సాంగ్స్ ఇవ్వలేదు. మళ్ళీ మళ్ళీ వినాలనిపించే చార్ట్ బస్టర్స్ పడలేదు. తెరమీద చూశాక మీ అభిప్రాయం మారుతుందని రవితేజ చెప్పడం ఎంత వరకు నిజమో షో అయ్యాకే తేలుతుంది. నిర్మాత నాగవంశీ ఈసారి స్టేట్ మెంట్లకు దూరంగా ఉన్నారు. కింగ్డమ్, వార్ 2 అనుభవాల దృష్ట్యా ఈసారి ఎలాంటి కామెంట్లు చేయలేదు. రిజల్ట్ వచ్చాక మాట్లాడతా అన్నారు. ప్రమోషన్లలో ఆయన హడావిడి లేకపోవడం కొంత లోటే. ఇవన్నీ ఎలా ఉన్నా మాస్ తో బాగుందని అనిపించుకుంటే చాలు బాక్సాఫిస్ జాతర చేసుకోవచ్చు. చూద్దాం.
This post was last modified on October 31, 2025 2:18 pm
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…