Movie News

రాజమౌళిని భయపెట్టిన వాట్సాప్ గ్రూపు

‘మగధీర’ దగ్గర్నుంచి తన ప్రతి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని కొన్ని మెట్లు ఎక్కిస్తూ సాగాడు రాజమౌళి. ‘బాహుబలి’తో మొత్తంగా ఇండియన్ సినిమానే తీసుకెళ్లి ప్రపంచ స్థాయిలో నిలబెట్టాడు. ఆ చిత్రానికి సన్నాహాలు మొదలైనపుడు తెలుగు సినిమా స్థాయి చాలా తక్కువ. అప్పటి ఇండస్ట్రీ హిట్ అయిన ‘మగధీర’ రూ.80 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే.. దాని మీద రూ.40 కోట్లు ఎక్కువ, అంటే రూ.120 కోట్ల బడ్జెట్లో ఈ సినిమాను మొదలుపెట్టింది చిత్ర బృందం. 

ఐతే ఆ బడ్జెట్‌ను వర్కవుట్ చేయగలమనే నమ్మకంతోనే సినిమాను మొదలుపెట్టారు. తర్వాత సినిమా రెండు భాగాలైంది. ముందు అనుకున్న దాంతో పోలిస్తే రెట్టింపు కన్నా ఎక్కువకు బడ్జెట్ పెరిగిపోయింది. ఇంత సాహసోపేతంగా సినిమా తీసి రిలీజ్ చేస్తే.. ముందు రోజు అర్ధరాత్రి ప్రిమియర్స్ నుంచి డివైడ్ టాక్ వచ్చింది. అప్పుడు తనతో పాటు టీం అంతా ఎంత టెన్షన్ అనుభవించిందో ‘బాహుబలి: ది ఎపిక్’ రీ రిలీజ్ సందర్భంగా ప్రభాస్, రానాలతో కలిసి చేసిన ఇంటర్వ్యూలో రాజమౌళి వెల్లడించాడు.

‘‘సినిమా మీద నమ్మకంతో భారీ బడ్జెట్ పెట్టేశాం. దాన్ని వర్కవుట్ చేయగలమనే అనుకున్నాం. కానీ ఆ చిత్రం డెఫిషిట్‌తో రిలీజైంది. శోభు గారు పైకి రూ.20 కోట్ల డెఫిషిట్ అన్నారు. కానీ వాస్తవానికి అది రూ.40 కోట్లు. తీరా ముందు రోజు అర్ధరాత్రి ప్రిమియర్స్ వేస్తే వాటి నుంచి నెగెటివ్ టాక్ వచ్చింది. అంతకంతకూ డివైడ్ టాక్ పెరిగింది. వదినను అనుకోకుండా ఒక జర్నలిస్ట్ గ్రూప్‌లో ఎవరో యాడ్ చేశారు. ఆమె అందులో ఉన్నట్లు వాళ్లకు తెలియదు. ఫస్ట్ షో అవ్వగానే ఎవరో ప్రభాస్ శివలింగాన్ని ఎత్తే ఫొటోను ఎడిట్ చేసి శివలింగం బదులు జండూబామ్ పెట్టి పోస్ట్ చేశారు. ఇది బాహుబలి కాదు.. ప్రొడ్యూసర్ బలి, డిస్ట్రిబ్యూటర్లు బలి, ప్రేక్షకులు బలి అంటూ కొందరు కామెంట్లు చేశారు. 

ఇలా అన్నీ నెగెటివ్ కామెంట్లు రావడంతో వదిన కంగారు పడిపోయారు. మాకు వెంటనే చెప్పలేదు. తర్వాత అవి చూపించారు. మాకు ఈ టాక్ ఏంటని అర్థం కాలేదు. దర్శకుడిగా నాకేం ఇబ్బంది లేదు. ఇంకో సినిమాతో రికవర్ అయిపోతాను. కానీ నిర్మాతలు ఏమైపోతారని నా భయం. అవసరమైతే మన ఆస్తులు కూడా అమ్ముదాంలే అని లెక్కలు చూసుకున్నాం. కానీ మనం బ్యాడ్ సినిమా తీయలేదు కదా, బాగా ఆడుతుందిలే అని లోలోన నమ్మకం ఉంది.

తర్వాత డిస్ట్రిబ్యూటర్ సాయిగారిని కలిశాను. సెకండ్ పార్ట్ ఏం చేయాలి అని మాట్లాడుకున్నాం. ఆయన ముంబయి నుంచి ఫైనాన్షియర్లను తీసుకొచ్చి ఇంకో 70 కోట్లు పెట్టి రెండో భాగం పూర్తి చేసేద్దాంలే అని ధైర్యం చెప్పారు. తర్వాత సినిమా పరిస్థితి ఏంటా అని వాకబు చేస్తే.. సాయంత్రానికి రెస్పాన్స్ మామూలుగా లేదని సాయి గారు చెప్పారు. సినిమా బాలేకుంటే కలెక్షన్లు పెరగవని.. టికెట్లు సర్దుబాటు చేయడం కష్టంగా ఉందని… భయపడాల్సిన పనేమీ లేదని భరోసా ఇచ్చారు. అయినా రెండు మూడు రోజులు చూద్దామని ఆగాం. కానీ సినిమా ఎక్కడా తగ్గలేదు. ఎక్కడికో వెళ్లిపోయింది’’ అని రాజమౌళి అప్పటి టెన్షన్‌ను గుర్తు చేసుకున్నాడు.

This post was last modified on October 30, 2025 5:08 pm

Share

Recent Posts

లిక్క‌ర్ కేసు… జ‌గ‌న్ అరెస్టుకు రంగం సిద్ధమేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ అరెస్టు ఎంతో దూరంలో లేదా? ఈ ఏడాదే ఆయ‌న‌ను అరెస్టు చేయొచ్చా.? అది త‌ప్పితే.. ఆయ‌న…

34 minutes ago

ఓటిటి అభిప్రాయాలు ఎందుకు మారుతున్నాయ్

నిన్న ఇరుముడి ఓటిటిలో వచ్చేసింది. థియేటర్ రన్ ఇంకా కొనసాగుతున్నప్పటికీ ముందస్తు అగ్రిమెంట్ వల్ల కేవలం 28 రోజుల విండోతో…

2 hours ago

లాఠీలు గీత దాటుతున్నాయి రేవంత్ గారు

తెలంగాణాలోని రైల్వే స్టేషన్ వద్ద చెత్త ఏరుకునే ఒక మహిళ మీద హోం గార్డు చేసిన దౌర్జన్యం తీవ్ర దుమారం…

2 hours ago

ఆస్కార్ వెళ్లేంత గొప్పగా ఉందా ‘గోంధల్’

ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…

5 hours ago

అవతార్ పోలికంటే అతిశయోక్తి అవుతుందేమో

నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…

6 hours ago

సాయిరెడ్డి వెంట న‌డిచే రెడ్లు ఉన్నారా?

పార్టీ ఏదైనా.. నాయ‌కుడు ఎవ‌రైనా సొంత సామాజిక వ‌ర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేక‌పోతే.. ప్ర‌జాబ‌లం అయినా…

6 hours ago