Movie News

రవితేజ స్టామినాకు అసలు పరీక్ష

రేపు సాయంత్రం నుంచి మాస్ జాతర ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. రవితేజ సినిమా విడుదలవుతోందంటే ఓ రేంజ్ హడావిడి కనిపించాలి. కానీ ఇప్పటికైతే ఆ స్థాయి సౌండ్ సోషల్ మీడియాలో వినిపించడం లేదు. ఒక పక్క తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న తుఫాను, ఇంకోవైపు బాహుబలి ది ఎపిక్ రీ రిలీజ్ హంగామా వెరసి మాస్ రాజా మూవీ మీద పెద్ద ప్రభావమే చూపిస్తున్నాయి. హైదరాబాద్ లో అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే ఉన్నాయి కానీ మిగిలిన ప్రాంతాల్లో మాస్ జాతర హడావిడి ఆశించిన స్థాయిలో లేదు. ప్రమోషన్ల పరంగా టీమ్ చేసుకున్న ప్లానింగ్ మరీ గొప్ప ఫలితాలు ఇవ్వలేదన్నది వాస్తవం.

ఒకరకంగా చెప్పాలంటే రవితేజ స్టామినాకి ఇది అగ్ని పరీక్షే. ఎందుకంటే చేసింది రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్ టైనరే అయినా మాస్ జనాలు కన్విన్స్ అయ్యేలా కంటెంట్ ఉంటే ఈజీగా హిట్టు కొట్టొచ్చు. దానికి ధమాకానే మంచి ఉదాహరణ. ఆ సినిమాకు సంగీతం అందించిన భీమ్సే ఇప్పుడీ మాస్ జాతరకు పని చేసినప్పటికీ ఆ స్థాయి వైరల్ సాంగ్స్ ఇవ్వలేకపోవడం మైనస్ గా నిలిచింది. ట్రైలర్ కొచ్చిన రెస్పాన్స్ కూడా జస్ట్ ఓకే అనిపించుకుంది తప్ప వావ్ కాదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్వయంగా రవితేజనే గతంలో చిరాకు కలిగించాను, ఇది పక్కా హిట్టని హామీ ఇవ్వడం ఫ్యాన్స్ నమ్మకం పెరిగేలా చేసింది.

ఇక అసలైన టైం వచ్చేసింది. రేపు సాయంత్రం ఆరు గంటల నుంచే మాస్ జాతర షోలు మొదలైపోతాయి. టాక్ చాలా కీలకం కానుంది. జస్ట్ యావరేజ్ అనిపించుకున్నా రికవరీ చేయడం రవితేజకు మంచి నీళ్లు తాగినంత ఈజీ. లేదూ హిట్టు అనిపించుకుంటే కనీసం రెండు వారాలు మంచి ర్యాంపేజ్ ఉంటుంది. లిటిల్ హార్ట్స్, కిష్కిందపురి, మిరాయ్, ఓజి, కాంతార చాప్టర్ 1 ఏ లెజెండ్ తో సెప్టెంబర్, అక్టోబర్ నెలలు కళకళలాడాయి. మరి ఈ మంత్ ఎండ్ ని రవితేజ హిట్టుతో ముగిస్తే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది. ఈ సస్పెన్స్ ఇంకో ముప్పై గంటల తర్వాత వీడిపోతుంది. మాస్ రాజా గెలిచాడో లేదో తేలిపోతుంది.

This post was last modified on October 30, 2025 11:49 am

Share

Recent Posts

చంద్రబాబు దార్శనికతకు నిదర్శనం

తిరుమల అంటే కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక. నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకునే ఈ పుణ్యక్షేత్రంలో…

11 minutes ago

కాకినాడ‌, శ్రీకాకుళంపై పట్టు వదలని పవన్!

ఇటీవ‌ల జ‌రిగిన మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో మిగిలిపోయిన కార్పొరేష‌న్ స్థానాల‌కు, అలానే మునిసిపాలిటీల‌కు త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో…

6 hours ago

బాబు నివాసానికి షర్మిల… వివాహ ఆహ్వానం కోసమే కాదు!

ఏపీ సీఎం చంద్ర‌బాబుతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల భేటీ అయ్యారు. ఆదివారం సాయంత్రం ష‌ర్మిల‌.. హైద‌రాబాద్‌లోని…

8 hours ago

ఆమె వ‌ద్ద‌ని.. ఆమెతోనే రెండు సినిమాల‌కు కాంట్రాక్ట్

వ‌చ్చే శుక్ర‌వారం ద‌క్షిణాదిన మంచి అంచ‌నాల మ‌ధ్య విడుద‌ల కాబోతున్న సినిమా.. ఆకాశంలో ఒక తార‌. దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా…

9 hours ago

జ‌గ‌న్ పత్రికకు రూ.10 కోట్ల పరువునష్టం నోటీసు

ఏపీ రాజ‌ధాని అమరావతి ప్రాంతంలో భూముల వ్యవహారంపై తమ కుటుంబానికి సంబంధించి అసత్య ఆరోపణలతో కథనాలు ప్రచురించారంటూ వైసీపీ అధినేత‌…

9 hours ago

మాకు ఆ సీఈఓనే కావాలంటూ లక్ష సంతకాలు

ప్రపంచ టెక్నాలజీ రంగంలో ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలక శక్తిగా ఎదుగుతోంది. ఈ మార్పులో ఎన్విడియా సంస్థ పోషిస్తున్న పాత్ర…

10 hours ago