కన్నడ భామ రష్మిక మందన్నా కెరీర్లో అతి పెద్ద మలుపు పుష్ప సినిమానే. ఆ చిత్రంలో శ్రీవల్లి పాత్రతో ఆమె దేశవ్యాప్తంగా తిరుగులేని గుర్తింపు సంపాదించింది. ఆ మాటకొస్తే విదేశాల్లో సైతం రష్మిక మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ఇక ‘పుష్ప-2’తో ఆమె క్రేజ్ ఇంకా ఏ స్థాయిలో విస్తరించిందో తెలిసిందే. ఐతే ఇంత ఇంపాక్ట్ చూపించిన పాత్ర ముందు తనకు అర్థం కాలేదని.. దాంతో కనెక్ట్ కాలేకపోయానని చెప్పింది రష్మిక.
‘పుష్ప’ సినిమా చేస్తున్నపుడు ఆ కథ.. తన పాత్ర కొంచెం గందరగోళంగా అనిపించినట్లు రష్మిక తెలిపింది. పార్ట్-1లో సుకుమార్ వరల్డ్ బిల్డింగ్ మీద దృష్టిపెట్టారని.. దీంతో తనకు కథ మీద క్లారిటీ రాలేదని రష్మి చెప్పింది. షూటింగ్‌కు వెళ్లడం.. తనకు ఇచ్చిన సీన్ చేసి వచ్చేయడం.. ఇలా ఉండేదని.. ఓవరాల్‌గా కథలో ఏం జరుగుతోందో అర్థం అయ్యేది కాదని ఆమె చెప్పింది. కానీ పార్ట్-2కు వచ్చేసరికి తనకు చాలా విషయాల మీద క్లారిటీ వచ్చిందని.. సుకుమార్ ముందు అలా ఎందుకు చేశారో అప్పుడు అర్థమైందని రష్మిక చెప్పింది.
‘పుష్ప-2’ నటించడాన్ని ఎంతో ఆస్వాదించానని.. అది తన కెరీర్లోనే ది బెస్ట్ అనదగ్గ పెర్ఫామెన్స్ అని రష్మిక చెప్పింది. ఒక నటి ఐదు నిమిషాల పాటు కేవలం తను మాత్రమే పెర్ఫామ్ చేసే అవకాశం ఎప్పుడో కానీ రాదని.. తనకు జాతర ఎపిసోడ్లో ఆ అద్భుత అవకాశం వచ్చిందని ఆమె చెప్పింది. ఆ సీన్ చేస్తున్నపుడు సెట్లో ఎవరెవరు ఉన్నారు.. కెమెరా ఎక్కడ ఉంది.. ఎవరేం చేస్తున్నారు అన్నది పట్టించుకోకుండా కేవలం తన పెర్ఫామెన్స్ మీద మాత్రమే దృష్టిపెట్టి స్వేచ్ఛగా నటించానని.. అందుకే ఆ సన్నివేశం అంత బాగా వచ్చిందని రష్మిక చెప్పింది. ఈ పాత్ర తన కెరీర్లో ఎప్పటికీ ఎంతో ప్రత్యేకమని ఆమె అభిప్రాయపడింది.
This post was last modified on October 29, 2025 3:20 pm
సౌతాఫ్రికా సిరీస్‌లో విరాట్ కోహ్లీ విశ్వరూపం చూశాం. పది నెలల తర్వాత సొంతగడ్డపై ఆడుతూ పరుగుల వరద పారించాడు. మూడు…
పొన్నియిన్ సెల్వన్ తర్వాత మణిరత్నం కంబ్యాక్ అయ్యారని అభిమానులు భావించారు కానీ థగ్ లైఫ్ దెబ్బ మళ్ళీ కథను మొదటికే…
‘బాహుబలి’ కోసం ఐదేళ్ల పాటు ప్రభాస్ ఎంత కష్టపడ్డాడో.. రెండు పార్ట్స్‌లో ఎంతో ఆకర్షణీయంగా కనిపించాడో తెలిసిందే. కానీ అంత…
తన జీవితంలో జరగని సంఘటన ఇప్పుడు జరిగిందంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు.…
రీఎంట్రీ తర్వాత వరుసగా మూడు రీమేక్‌లతో పలకరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ ఏడాది రెండు నెలల వ్యవధిలో రెండు…
మన శంకరవరప్రసాద్ గారు నుంచి మరో పాట వచ్చేసింది. నిజానికీ రిలీజ్ రేపు జరగాలి. కానీ ఒక రోజు ముందుగా…