పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు, మద్దతుదారులకు ఉన్నట్లుండి పెద్ద శత్రువుగా మారిపోయారు సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్. పవన్ రాజకీయ విధానాలను ఎప్పటికప్పుడు మార్చుకోవడంపై ప్రకాష్ రాజ్ ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ప్రధానంగా ‘‘పవన్ ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నాడు’’ అనే మాట అతడి అభిమానులకు ఏమాత్రం రుచించలేదు.
ఇంత పెద్ద మాట ప్రకాష్ రాజ్ అనాల్సింది కాదనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తోంది. ఈ వ్యాఖ్యలపై నాగబాబు తీవ్రంగా స్పందించడం, దానికి ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో బదులివ్వడంతో కొన్ని రోజులుగా ఈ వ్యవహారం చర్చనీయాంశం అవుతోంది. ఇంతకీ ప్రకాష్ రాజ్ తనపై చేసిన విమర్శలకు సంబంధించి పవన్ స్పందన ఏంటి.. సందర్భం వచ్చినపుడు ఆయన ప్రకాష్ రాజ్‌కు ఏమని బదులిస్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది.
పవన్ మీడియాను కలిసినపుడు కచ్చితంగా ఈ ప్రశ్న ఎదురు కావచ్చు. ఐతే అంతకంటే ముందు ప్రకాష్ రాజ్.. పవన్‌కు ఎదురు పడితే ఇద్దరి మధ్య ఎలాంటి వాతావరణం ఉంటుందన్నది ఆసక్తికరం. నిజానికి ఇప్పుడు ఇద్దరి మధ్య అలాంటి సందర్భమే ఉంది. పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’లో ప్రకాష్ రాజ్ కూడా ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. ఇందులో పవన్ బాధితురాళ్లయిన అమ్మాయిల తరఫున వాదించే లాయర్ పాత్ర చేస్తుండగా.. అటు వైపు బడా బాబుల వైపు వాదించే ప్రత్యర్థి లాయర్‌గా ప్రకాష్ రాజ్ కనిపిస్తున్నాడు.
ఈ నెల ఆరంభం నుంచే పవన్ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ప్రకాష్ రాజ్‌కు కూడా ఈ సన్నివేశాల్లో భాగస్వామ్యం ఉంది. ప్రస్తుతం పవన్ కొంత విరామం తీసుకుని.. మళ్లీ షూటింగ్‌కు రాబోతున్నాడు. అప్పుడు ప్రకాష్ రాజ్ కూడా షూటింగ్‌లో పాల్గొనే అవకాశముంది. అదే జరిగితే ప్రకాష్ రాజ్ తాజా విమర్శల నేపథ్యంలో వీళ్లిద్దరూ ఒకరికొకరు ఎదురు పడ్డపుడు పరిస్థితి ఏంటో చూడాలి.
ఇద్దరూ మామూలుగా మాట్లాడుకుంటారా.. బేషజాల్లేకుండా పలకరించుకుంటారా.. విమర్శల ప్రస్తావన వస్తుందా అన్నది ఆసక్తికరం. ఇదే విషయం ప్రకాష్ రాజ్ దగ్గర ప్రస్తావిస్తే వ్యక్తిగతంగా, సినిమాల పరంగా తనకు పవన్‌తో ఎలాంటి విభేదాలు లేవని.. ప్రొఫెషనల్‌గా తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని చెప్పాడు. ఇంతకుముందు వీళ్లిద్దరూ బద్రి, కెమెరామన్ గంగతో రాంబాబు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.
This post was last modified on November 30, 2020 2:00 pm
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…